Wednesday, March 18, 2026
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ:  తమిళ్ తలైవాస్ కు తొలి విజయం 

ప్రొ కబడ్డీ:  తమిళ్ తలైవాస్ కు తొలి విజయం 

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ ఈ సీజన్ లో తమిళ్ తలైవాస్ తొలి విజయం నమోదు చేసుకుంది. మరో మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్ ఘనవిజయం సాధించి రెండో స్థానంలోకి దూసుకెళ్లింది.

తమిళ్ తలైవాస్ – పునేరి పల్టాన్స్  మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో తమిళ్ 36-26 తేడాతో విజయం సాధించింది. ఆట ఫస్ట్ హాఫ్ లో 18-11 ఆధిక్యం సంపాదించిన తలైవాస్ రెండో అర్ధ భాగంలోనూ 18-15 తో పైచేయి సాధించింది. దీనితో ఆట ముగిసే సమయానికి 10 పాయింట్ల తేడాతో గెలుపొందింది. తమిళ్ ఆటగాడు అజింక్యా పవార్ 11 పాయింట్లు సంపాదించి  జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

పాట్నా పైరేట్స్ –బెంగాల్ వారియర్స్  మధ్య జరిగిన  రెండో మ్యాచ్ లో  పాట్నా  44-30 తేడాతో 14 పాయింట్లతో ఘనవిజయం సాధించింది. ఆట తొలి భాగంలో బెంగాల్ 21-16 తో ఆధిక్యం సంపాదించినా రెండో అర్ధభాగంలో పాట్నా జట్టు చెలరేగి ఆడి బెంగాల్ ను రెండు సార్లు ఆలౌట్ చేసి 28-9తో తిరుగులేని ఆధిక్యం సంపాదించి సత్తా చాటింది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ తరువాత రెండో స్థానాన్ని ఆక్రమించింది. పాట్నా ఆటగాడు మను గోయత్ 15 పాయింట్లు సాధించడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular