Friday, April 19, 2024
Homeసినిమాతరుణ్ భాస్కర్ కీడా కోలా ప్రారంభం

తరుణ్ భాస్కర్ కీడా కోలా ప్రారంభం

యంగ్ అండ్ ట్యాలెంటడ్ డైరెక్ట‌ర్ తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రం ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

ఈ వేడుకకు నిర్మాత సురేష్ బాబు, హీరోలు సిద్ధార్థ్, తేజ సజ్జా, నందు, పలువురు యువ దర్శకులు హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విశేష్ అందించారు. త్వరలోనే చిత్ర యూనిట్ షూటింగ్ ప్రారంభించనుంది. శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్ సుధాంషు, కౌశిక్ నండూరి నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 లో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్