Friday, April 19, 2024
HomeTrending Newsటాటా చేతికి ఎయిరిండియా

టాటా చేతికి ఎయిరిండియా

భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రతిష్టాత్మక టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. దాదాపు 43 వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాలో 100శాతం పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం బిడ్ లు ఆహ్వానించింది. ఈ బిడ్లలో టాటా సన్స్, స్పైస్ జెట్ లు పాల్గొన్నాయి. చివరకు టాటా సన్స్ దాఖలు చేసిన బిడ్ ఆమోదిస్తున్నట్లు మంత్రుల కమిటీ వెల్లడించింది. ఈ కమిటీలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్,  పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఉన్నారు.

1932లో టాటా ఎయిర్ లైన్స్ పేరుతో విమాన యాన సంస్థను దేశంలో జే ఆర్ డి టాటా నెలకొల్పారు. 1948లో ఈ సంస్థలో 49 శాతం వాటాను పొందిన కేంద్ర ప్రభుత్వం 1953  లో రూపొందించిన ఎయిర్ కార్పోరేషన్స్ యాక్ట్ ప్రకారం మొత్తం సంస్థను జాతీయం చేశారు.  68 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎయిరిండియా టాటా పరం కానుంది.. డిసెంబర్ నాటికి ప్రక్రియ మొత్తం పూర్తయి టాటా నిర్వహణలోకి ఎయిరిండియా వెళ్లనుంది.  ప్రస్తుతం టాటా కంపెనీ సింగపూర్ ఎయిర్ లైన్స్ తో కలిసి విస్తార సర్వీసు లో భాగస్వామిగా ఉంది.

వరుస నష్టాలతో కూరుకుపోతున్న ఎయిరిండియాలో 78 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం 2018లో నిర్ణయించింది. అయితే ఎవరూ ముందుకు రాకపోవడంతో మొత్తం 100 శాతం వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమైంది. 2020 జనవరిలోనే ఈ వాటా విక్రయ ప్రక్రియ మొదలైనప్పటికీ కోవిడ్ కారణంగా బ్రేక్ పడింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్