పొత్తుల అంశంపై ఎన్నికల ముందే నిర్ణయాలు ఉంటాయని, కానీ రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయాలని మెజార్టీ ప్రజలు కోరుతున్నారని టిడిపి నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యక్యానించారు.  అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలకుండా రెండు పార్టీలూ వేదిక మీదకు వస్తే బాగుంటుందన్నది ప్రజల అభిమతమన్నారు. గత ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించిన వైసీపీ మొన్నటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కేవలం 30 శాతమే వచ్చాయన్నారు.  టిడిపి. పిడిఎఫ్, బిజెపిలకు వచ్చిన ఓట్లు మొత్తం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లేనన్నారు. అందుకే ఓట్లు చీలకపోతే టిడిపి గెలుపు కూడా ఏకపక్షంగా ఉండబోతుందని, రాబోయే విజయం ఒక చరిత్ర సృష్టించబోతోందని  ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గంటా శ్రీనివాసరావు.. మాజీ మంత్రి ఇటీవలే టిడిపిలో చేరిన కన్నా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

విశాఖ రాజధాని వద్దని అక్కడి ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా తమ తీర్పు ద్వారా తెలియజేశారని గంటా చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాజధానిపై రెఫరెండం అని స్వయంగా వైసీపే ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు చేశారని, ఎవరు ఎటు ఓటు వేశారో తెలుస్తుందని స్వయంగా మంత్రి బెదిరించారని, అయినా సరే పట్టభద్రులు టిడిపికి బారీ మెజార్టీ కట్టబెట్టారని గంటా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *