Friday, March 29, 2024
HomeTrending Newsమీ భాషపై ఆత్మపరిశీలన చేసుకోండి

మీ భాషపై ఆత్మపరిశీలన చేసుకోండి

ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు కుటుంబంపై అసత్యాలు, దూషణలతో వైసీపీ నేతలు విషప్రచారం చేస్తునారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వైసీపీ నేతలు ఈ రకమైన భాషతో మీడియా సమావేశం పెట్టారని, దీనిపై ఒక్కసారి ఆ నేతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.  రాజకీయాల కోసం ఇంత దిగజారాలా, పదవుల కోసం ఈ రకమైన ఆరోపణలు చేయాలా అని నిలదీశారు. ఇలా మాట్లాడి  తమ గౌరవాన్ని దిగజార్చుకోవద్దని హితవు పలికారు.

నిన్న వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత చేసిన తీవ్ర వ్యాఖ్యలపై రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోతుల సురేష్, చమన్, పరిటాల రవీంద్ర కలిసి పని చేశారని, చంద్రబాబు దయ వల్లే సునీత రాజకీయంగా గుర్తింపు సంపాదించారని, ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తీ సునీత ఇలా మాట్లాడడం బాధగా ఉందన్నారు. ఒక బలహీనవర్గాల్లో పుట్టిన సునీత ఆమె, బీసీల గౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు.  నారా భువనేశ్వరి హెరిటేజ్ సంస్థను దేశంలోనే ఓ ఆదర్శ సంస్థగా తీర్చి దిద్దిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.  ఎన్టీఆర్ ట్రస్ట్, విద్యా సంస్థలు, క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎందరో పేదవారికి సేవలు అందిస్తున్నారని అలాంటి వారిపై ఇలాంటి భాష మాట్లాడడం తగదన్నారు.

ప్రభుత్వ మద్యం పాలసీ ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిందని, సిఎం జగన్ ఆదాయం పెరిగిందని రవీంద్ర ఆరోపించారు. చిన్న చిన్న బడ్డీషాపుల్లో కూడా ఆన్ లైన్ పేమెంట్లు తీసుకుంటున్నారని, అలాంటిది మద్యం షాపుల్లో కేవలం డబ్బు  మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.

Also Read : ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు: బాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్