Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపికి, ఎల్లోమీడియాకు ఒక అలవాటుగా మారిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మండిపడ్డారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోంది. కనీస విలువలను పాటించాలన్న స్పృహకోల్పోయి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వీరినుంచి ముఖ్యమంత్రి కుటుంబానికే కాదు, రాష్ట్రానికీ ముప్పు మరింత పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనమీద యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయి. వయసు మీద పడుతున్న కొద్దీ.. యనమల కనీస సంస్కారం కూడా లేకుండా రోజురోజుకూడా దిగజారిపోతున్నారని విమర్శిస్తూ మంత్రి బుగ్గన ఈ రోజు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రులుగా పనిచేసిన వారికి కూడా విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తదితర అంశాలమీద అవగాహన లేకపోవడం, దీనిమీద పనిగట్టుకుని ముఖ్యమంత్రి మీద, ఆయన కుటుంబం మీద విషప్రచారం చేయడం యనమల లాంటి నేతలు, ఎల్లోమీడియా ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం అవుతుంది. దాపరికంతో, దొంగదారుల్లో అధికారం సాధించడం, ప్రజలన్ని వంచించడం అన్నది టీడీపీ ట్రేడ్‌ మార్క్‌ తప్ప మాది కాదు. ముఖ్యమంత్రి పర్యటన రహస్యమేమీ కాదు. కుటుంబ సభ్యులతో కలిసి దావోస్‌ చేరుకుంటారన్న దాంట్లో ఎలాంటి రహస్యం లేదు. నిన్న గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. ఎయిర్‌ట్రాఫిక్‌ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగింది.

దీనివల్ల లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యింది. లండన్‌లో కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంది. ఈలోగా జురెక్‌లో ల్యాండ్‌ అవడానికి ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయింది. మళ్లీ ల్యాండింగ్‌కోసం అధికారులు రిక్వెస్ట్‌పెట్టారు. ఈప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు కూడా స్వయంగా పాల్గొన్నారు. రాత్రి 10 గంటల తర్వాత జురెక్‌లో విమానాలు ల్యాండింగ్‌ను చాలా సంవత్సరాల నుంచి నిషేధించిన విషయాన్ని స్విస్‌ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులకు నివేదించారు. ఈ విషయాలన్నీకూడా స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు– లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించారు. వారు నేరుగా ముఖ్యమంత్రితో కూడిన అధికారులతో చర్చించి.. లండన్‌లోనే ముఖ్యమంత్రికి బస ఏర్పాటు చేశారు.
తెల్లవారుజామునే జురెక్‌ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ… పైలట్లు నిన్న అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. నిజాలు ఇలా ఉంటే.. ముఖ్యమంత్రి మీద అసూయతో, ద్వేషంతో రగిలిపోతున్న టీడీపీ నాయకులు, ఎల్లోమీడియా ప్రతిరోజూ ఆయన మీద బురదజల్లడం, ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. దిగజారిపోవడంలో మరో మైలు రాయిని టీడీపీ అందుకుంది. ముఖ్యమంత్రిగారు కాసేపట్లో దావోస్‌ చేరుకుంటారు.

Also Read : సిఎం జగన్ లండన్ టూర్ మిస్టరీ…యనమల విమర్శ

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com