Thursday, March 27, 2025
HomeTrending Newsగవర్నర్ ప్రసంగం: టిడిపి నినాదాలు

గవర్నర్ ప్రసంగం: టిడిపి నినాదాలు

TDP slogans: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు  అంతరాయం కలిగించాలని ప్రయత్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. టిడిపి సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాసేపటికి టిడిపి సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు.

గవర్నర్ ప్రసంగం తరువాత బైటకు వెళ్ళే ద్వారం వద్ద బైఠాయించేందుకు టిడిపి సభ్యులు యత్నించగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. తాము మండలికి వెళ్ళాలని తమని అనుమతించాలని ఎమ్మెల్సీ లోకేష్ వారితో వాగ్వాదానికి దిగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్