Jangareddygudem row: కల్తీ సారా మరణాలపై సభలో వెంటనే చర్చ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు నేడు కూడా సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ‘కల్తీ సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే’, ‘కల్తీ సారా మరణాలపై వెంటనే చర్చను చేపట్టాలి’ అంటూ టిడిపి సభ్యులు నినాదాలు చేశారు.
ఒకసారి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ అంగీకరించినా, తిరస్కరించినా మళ్ళీ అదే విషయమై, ఆ సెషన్ లో మరోసారి అదే అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వడం కుదరదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి రూల్ బుల్ లోని అంశాన్ని చదివి వినిపించారు. జంగారెడ్డి గూడెం విషయమై నిన్న మంత్రి సభలో ప్రకటన చేశారని, మళ్ళీ ఇదే అంశంపై చర్చ కావాలంటే వేరే ఫార్మాట్ లో రావాలని, అంతే తప్ప సభను అడ్డుకోవడం సరికాదని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.
టిడిపి నినాదాల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. జంగారెడ్డి గూడెం మరణాలపై టిడిపి సభ్యుడు అనగాని సత్య ప్రసాద్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం టీ విరామానికి సభను కాసేపు వాయిదా వేశారు.
Also Read : అందరూ కలుస్తున్నారు: పేర్ని ఎద్దేవా