అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సంక్షేమ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ విపక్ష తెలుగుదేశం నిరసన చేపట్టింది. ‘సంక్షోభంలో సంక్షేమం’ నినాదంతో అసెంబ్లీ సమీపంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని, నవరత్నాల పేరుతో సంక్షేమానికి మరణశాసనం రాస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ విదేశీ విద్య ఎత్తివేశారని, అమ్మ ఒడిని అర్ధ ఒడి చేశారని నినాదాలు చేశారు. క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా రద్దు చేశారని ఆరోపించారు.
మరోవైపు తెలుగుదేశం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ సమీపంలోని ఓ భవనం పైకి ఎక్కి నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఓ కార్యకర్త మందడం లోని సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లపై సుప్రీంలో విచారణ