Wednesday, January 22, 2025
HomeTrending NewsChandrababu: త్వరలో కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తా: బాబు

Chandrababu: త్వరలో కొత్త సంక్షేమ పథకాలు ప్రకటిస్తా: బాబు

తెలుగుదేశం అంటేనే సంక్షేమం అని, తమ విధానాల వల్ల సంపద సృష్టి జరిగిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల పాలనలో జగన్ ఒక్క పని చేశాడా అని ప్రశించారు. పెదకూరపాడు  నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో బాబు ప్రసంగించారు. జగన్ అధికారంలోకి రావడంతోనే విధ్వంసంతోనే పాలన ప్రారంభించాడని, అందరి జీవితాలు నాశనం చేశాడని…  రూ. 10 ఇచ్చి 100 దోచేశాడని ధ్వజమెత్తారు.  రూ.600 ఉండే వంట గ్యాస్ రూ.1200 అయ్యిందని,  తన హయంలో దీపం పథకం ద్వారా గ్యాస్ ఇచ్చానని, ఇప్పుడు ఈ సిఎం మీ దీపం ఆర్పాడంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

బాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • సోలార్ విద్యుత్ పెంపు  ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గించవచ్చు. మన ప్రభుత్వం ఉండి ఉంటే  తగ్గించేవాళ్లం.
  • 5 ఏళ్లు పాటుమనం విద్యుత్  ఛార్జీలు పెంచలేదు. జగన్ 8 సార్లు పెంచాడు
  • మీ ఇంటి మీద జగన్ స్టిక్కర్ ఏంటి….మీ అనుమతి ఉందా స్టిక్కర్ వేయడానికి
  • జగన్ ఇంటి మీద మీ బొమ్మ వేస్తే ఒప్పుకుంటాడా….పోలీసుల ఇంటి మీద మీ బొమ్మ వేస్తే ఒప్పుకుంటారా?
  • మన ఇంటి మీద వీళ్ల బొమ్మలు ఏంటి…..ఆ స్టిక్కర్లు తీసేయండి. ఇంటికి వాళ్లు బొమ్మ అంటిస్తే…మనం వాళ్ల మొహంపై బొమ్మ వేస్తామని చెప్పండి
  • పట్టాదారు పుస్తకాలు, సర్వే రాళ్లపైనా జగన్ బొమ్మ ఏంటి?
  • ఇలాంటి పాలనతో సమాజాన్ని నాశనం చేస్తుంటే మనం ఓర్చుకోవాలా?
  • మొన్న యర్రగొండ పాలెం వెళితే సాక్షాత్తూ మంత్రే నాపై దాడి చేశాడు. దాడిలో నన్ను కాపాడబోయి ఎన్ఎస్జి కమాండో గాయపడ్డాడు.
  • ఏకంగా మంత్రి నాపై రౌడీయిజం చేయడం ప్రభుత్వ కుట్ర కాదా?
  • మీరు రౌడీయిజం చేస్తే మేం పారిపోవాలా…నేను ఎస్సీలకు అన్యాయం చేశానంటాడు ఆ మంత్రి
  • ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. ఎస్సీలకు కమిషన్, ఫైనాన్స్ కమిషన్ తెచ్చిన పార్టీ
  • ఎస్సీ నేతను ఆర్థిక మంత్రిగా చేసిన పార్టీ టీడీపీ.
  • ఎస్సీల పథకానికి అంబేద్కర్ పేరు తీసేసి జగన్ సొంత పేరు పెట్టుకున్నాడు. నిజమైన దళిత ద్రోహి జగన్ మోహన్ రెడ్డి.
  • బిసిలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతం చేసింది జగన్ మోహన్ రెడ్డి
  • ఎస్సీలకు, బిసిలకు, మైనారిటీలకు జగన్ ఒక్క కార్యక్రమం అయినా ఇచ్చాడా?
  • ఏం ఘన కార్య చేశాడని స్టిక్కర్లు వేసుకుంటున్నాడు
  • నేనేదో సంక్షేమం తొలగిస్తానని జగన్ ప్రచారం చేస్తున్నాడు. త్వరలో కొత్త సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తా.
  • జగన్ 4 ఏళ్లలో రూ. 2లక్షల కోట్లు సంపాదించాడు
  • జగన్ ఈ నియోజకవర్గంలో ఇసుక దందా ద్వారా నెలకు 20 కోట్లు దోచుకుంటున్నాడు. ఎమ్మెల్యే నెలకు 20 కోట్లు జగన్ కు చెల్లిస్తున్నాడు
  • నియోజవకవర్గంలో ఇసుద దందా అంతా ఎమ్మెల్యే ద్వారా నడుస్తోంది. కృష్టానదిలో రోడ్డు వేసి మరీ ఇసుక దోపిడీ చేస్తున్నారు.
  • మద్యం దుకాణాల్లో ఆన్లైన్ లో పేమెంట్ ఎందుకు తీసుకోవడం లేదు. డబ్బు అంతా ఎటుపోతుంది.
  • తెలుగు దేశం పార్టీ వస్తేనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
  • పేదరికం లేని సమాజం నిర్మించాలి అనేది నా జీవితాశయం
  • నిరుపేదలకు తెలుగు దేశం పార్టీ జెండా అండగా ఉంటుంది
  • సంపద సృష్టితో పాటు ఆ సంపదను పేదలకు చేర్చడం కూడా ముఖ్యం
  • రాష్ట్రంలో నేషనల్ హైవే రోడ్లు బాగున్నాయి…..కానీ రాష్ట్ర రహదారులు బాలేదు. దీనికి కారణం ఎవరు  జగన్ కదా?
  • జగన్ ఒక్క ఇల్లు కట్టాడా…మనం కట్టిన టిడ్కో ఇళ్లను కూడా లబ్దిదారులకు ఇవ్వలేదు
  • ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోయాయి…కానీ జగన్ ఆస్తులు మాత్రం పెరిగాయి.
  • దేశంలో అందరి సిఎంల కంటే జగన్ ఆస్తి ఎక్కువ. జగన్ ఆస్తి 510 కోట్లు
  • జగన్ ను నమ్ముకున్న వాళ్లు జైలుకుపోతారు. ఈ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాలి.
  • ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాడు 2750 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల, లిఫ్ట్ లపై ఖర్చు పెట్టాను.
  • కృష్ణా డెల్టా ఆధునీకరణ కోసం 470 కోట్లు పెట్టాను. పట్టిసీమ 10 నెలల్లో పూర్తి చేసి సాగునీటి సమస్య లేకుండా చేశాను.
  • కొండవీడు వాగు తో ఇబ్బంది లేకుండా 237 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను.
  • నాగార్జున సాగర్ కాలువల ఆధునీకరణ పనులు చేశాం.
  • పెదకూరపాడు నియోజవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతోంది. దోపిడీ చేసింది అంతా కక్కిస్తా.
  • పర్యావరణానికి నష్టం వస్తుందని చెపుతున్నా…ఇసుక తవ్వకాలు ఆపడం లేదు. నెలకు రూ. 20 కోట్లు ఇసుక సొమ్ము తాడేపల్లికి చెల్లిస్తున్నారు. అంటే ఎంత దోపిడీ అవుతుందో చూడండి.
  • రేషన్ బండి వెనుక బండి పెట్టి బియ్యం సేకరించి అక్రమంగా తరలిస్తున్నారు.
  • గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకుపోవాలని…..ఈ ప్రాంతంలో పనులకు శంకుస్థాపన చేశాను. టెండర్లు పిలిచాను. కానీ ఆపనులు కూడా ఆపేశారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్