7.1 C
New York
Saturday, December 2, 2023

Buy now

Homeసినిమాఆర్ఆర్ఆర్ టీం సామాజిక బాధ్యత

ఆర్ఆర్ఆర్ టీం సామాజిక బాధ్యత

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు వస్తుండడంతో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడ చూసిన హాస్పటల్లో బెడ్ లు ఖాళీ లేక, ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోతున్నారు. అయితే.. కరోనాను ఎదుర్కొవాలంటే అవగాహనతో పాటు మనోధైర్యం ఉండాలి. సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో కరోనా పై అవగాహన కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కరోనా పేషేంట్స్ కు అవసరమయ్యే సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ.. సహాయ, సహకారాన్ని అందిస్తున్నారు.

అయితే… ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ కూడా కరోనా నుంచి బయటపడడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా వినూత్న రీతిలో ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేసింది. అది ఏంటంటే.. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాట్లాడిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అందులో ఆలియా భట్‌ తెలుగులో.. రామ్‌చరణ్‌ తమిళంలో.. ఎన్టీఆర్‌ కన్నడలో.. రాజమౌళి మలయాళంలో.. అజయ్‌దేవ్‌గణ్‌ హిందీలో మాట్లాడుతూ.. కరోనా పై జాగ్రత్తలు చెప్పారు. అందరికీ తమ సందేశం చేరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఇంతకీ ఈ వీడియోలో ఏం చెప్పారంటే.. దేశంలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. గత సంవత్సరం కలిసిగట్టుగా ఉండి కరోనాకు వ్యతిరేకంగా ఎంతో పోరాడాం. మళ్లీ అలాగే పోరాడదాం. మాస్కు ధరించడం.. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం.. బయటకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడమే కరోనా పై పోరాడేందుకు మన దగ్గర ఉన్న ఆయుధాలు. వ్యాక్సిన్ పై అపోహలను నమ్మకండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులను టీకా వేయించుకునేలా ప్రొత్సహించండి అని తెలియచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్