కరోనా లక్షణాలుంటే వెంటనే చికిత్స మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టెస్టులు చేయించుకుని ఫలితాలు వచ్చేవరకూ ఆగకుండా వెంటనే చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బంది వుందని చెప్పారు. కరోనాపై సిఎం కెసియార్ నిరంతరం అధికారులతో సమీక్షిస్తున్నారని , ఖర్చు విషయంలో వెనకాదవద్దని చెప్పారని వెల్లడించారు.
కరోనా నియంత్రణ విషయంలో ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని సిఎస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణాలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే వుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రస్తుత పరిస్తితుల్లో రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టాల్సిన అవసరం లేదని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
ఆక్సిజన్ నిల్వలు తగినంతగా వున్నాయని, ఆస్ప్తత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంచుతున్నామని, వైద్య బృందాలు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తున్నాయని సిఎస్ వివరించారు.