Saturday, June 13, 2026
HomeTrending Newsతెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్ వీసీ నర్సింహారెడ్డి ఎంసెట్ షెడ్యూల్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ నెల 28న ఎంసెట్ , పీజీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల 3 నుండి దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగనుంది.

ఏప్రిల్ 10 వరకు ఎంసెట్ దరఖాస్తుకు అవకాశం ఉండనుంది. పీజీ ఈ సెట్ కి ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉన్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. మే 7,8,9 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు జరుగననున్నాయి. అలాగే, మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ఎంట్రెన్స్ పరీక్షలు జరుగనున్నాయని అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular