పంజాబ్ లో మద్దతు ధరకు వరి ధాన్యం కొంటున్నట్టు మన రాష్ట్రం ధాన్యం కూడా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రిని కోరుతామన్నారు. యసంగి వరి దాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులను కలిసేందుకు ఈ రోజు ఢిల్లీ బయలుదేరిన మంత్రుల బృందం. ఈ రోజు సాయంత్రం మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ ఢిల్లీ పయనమయ్యారు. ఎంపీ లు,మంత్రులు,అధికారులు, అందరం కలిసి కేంద్ర మంత్రిని కలుస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో వాస్తవలకు విరుద్ధంగా కేంద్ర మంత్రి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

కేంద్ర మంత్రుల నుండి స్పష్టమైన హామీ రాకపోతే మా భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా ఉటుందని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు అర్ధరహితమని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. వరి దాన్యం కొనుగోలుపై ఏమైనా మాట్లాడితే ఆ శాఖ మంత్రి మాట్లాడాలి లేదంటే సంబంధిత అధికారులు మాట్లాడాలి బండి సంజయ్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు.

Also Read : బోడి బెదిరింపులకు భయపడం – కెసిఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *