Sunday, March 15, 2026
HomeTrending Newsఆరోగ్య రంగంలో కేర‌ళ ప్ర‌థ‌మ స్థానం

ఆరోగ్య రంగంలో కేర‌ళ ప్ర‌థ‌మ స్థానం

Health Last Up : తెలంగాణ రాష్ట్రం మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. నీతి ఆయోగ్ న్యూఢిల్లీలో విడుద‌ల చేసిన 4వ ఆరోగ్య సూచిలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2018-19 ఏడాదికి గానూ తెలంగాణ 4వ స్థానంలో నిల‌వ‌గా, 2019-20 ఏడాదిలో మూడో స్థానానికి చేరింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను బలోపేతం చేస్తున్న విష‌యం తెలిసిందే. అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తూ, నాణ్య‌మైన వైద్యం అందించేందుకు కేసీఆర్ అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నార‌ని చెప్ప‌డానికి ఈ ర్యాంకు నిద‌ర్శ‌నం. రాష్ట్రాల వైద్య పురోగ‌తిపై 2019-20 ఏడాదికి సంబంధించిన 4వ హెల్త్ ఇండెక్స్ రిపోర్టును నీతి ఆయోగ్ సోమ‌వారం విడుద‌ల చేసింది.
కేర‌ళ ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా, త‌మిళ‌నాడు రెండో స్థానంలో, నాలుగో స్థానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నిలిచింది. వైద్య వ‌స‌తుల్లో వ‌రుస‌గా 4వ సారి కేర‌ళ అగ్ర‌స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాత్రం చిట్ట‌చివ‌ర‌న నిలిచింది. చిన్న రాష్ట్రాల జాబితాలో మిజోరం అత్యుత్త‌మ ప‌నితీరును ప్ర‌ద‌ర్శించింది. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో ఢిల్లీ, జ‌మ్మూక‌శ్మీర్ ముందున్నాయి. ప్రోత్సాహ‌క న‌మోదు రాష్ట్రాల్లో యూపీ అగ్ర‌భాగాన నిలిచింది.

Also Read : అన్నంతో ఆరోగ్యం వయా కుక్కర్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular