రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఉక్రెయిన్ లో వున్న తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా మన దేశానికి రప్పించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కి చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి లేఖ రాశారు.

ఈ సందర్భంగా ఉక్రెయిన్ దేశంలో ఉన్నత విద్య చదువుకోవడానికి మన తెలంగాణ విద్యార్థులు అధికంగా వెళుతున్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న వివాదం కారణంగా వారిని భారత ఎంబసీ వాళ్ళు వెళ్ళమన్నారని, వాళ్ళు దిక్కుతోచక బాధపడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆ విద్యార్థులు నా దృష్టికి తీసుకు వచ్చారని అన్నారు. అయితే, చదువుల కోసం వెళ్ళి, వాళ్లకు సంబంధం లేని సమస్యలో చిక్కుకు పోయారు. వారిని సురక్షితంగా మన దేశానికి రప్పించాలి. ఇందుకు కావాల్సిన చర్యలు తీసుకొని, ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి జై శంకర్ గారికి ఎంపీ రంజిత్ సింగ్ లేఖ రాశారు. సానుకూలంగా స్పందించి ఆయా విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనను విముక్తం చేయాలని ఆ లేఖలో కోరారు.

Also Read : ఉక్రెయిన్ విద్యార్థులకు హెల్ప్ లైన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *