Strike: కోవిడ్ సంక్షోభం తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు సినీ పరిశ్రమకు మరో సంక్షోభం ఎదురవుతోంది. వేతనాలు పెంపు కోసం సినీ కార్మికులు సమ్మె చేయాలని నిర్ణయించారు. రెండేళ్లకోసారి వేతనాలు పెంచాల్సి ఉన్నా ఇంతవరకూ వేతనాలు పెంచలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుండి సమ్మె మొదలుపెట్టి వేతనాలు పెంచే వరకు షూటింగ్ కు రాకూడదని సినీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మీద ఒత్తిడి తెచ్చేందుకు 24 యూనియన్ సభ్యులు రేపు ఉదయం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. నిర్మాతల మండలి ఈ విషయంలో స్పందించాల్సి ఉందని, వారి నుంచి తగిన స్పందన లేదని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వెల్లడించారు. నిర్మాతల స్పందన కోసం ఎదురు చూస్తున్నామని, సమ్మెపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెప్పారు.