Saturday, April 20, 2024
Homeసినిమాఅభిమానుల ఆశీస్సులు పూర్వ జన్మ సుకృతం : బాల‌కృష్ణ‌

అభిమానుల ఆశీస్సులు పూర్వ జన్మ సుకృతం : బాల‌కృష్ణ‌

Akhanda: pre-release:
నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన భారీ యాక్ష‌న్ మూవీ `అఖండ`. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. అఖండ ప్రమోషన్స్‌ లో భాగంగా  హైద్రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ వేడుక‌లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేసిన ఐకాన్ హీరో, చాక్లెట్ బాయ్.. తమ్ముడు అల్లు అర్జున్‌కు థాంక్స్. ఆహా‌లో టాక్ షో చేస్తున్నాను. మాకు, అల్లు కుటుంబంతో బంధం గురించి అప్పుడే చెప్పాను. బాబుకు నా ఆశీస్సులు. ప్రపంచం గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి.. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు. నలుమూలల నుంచి విచ్చేసిన అభిమానులకు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు, ప్రొడ్యూసర్లకు, మీడియాకు అందరికి థాంక్స్. ఇది ఏ ఒక్కరి సినిమా అని అనుకోవడం లేదు. అందరికి శివ పార్వతుల ఆశీస్సులు ఉండాలి.

మనం పలికే అక్షరంలో ఉండే బలం.. ఒక్కో అక్షరం కలిపితే మంత్రం అవుతుంది. ఆహాలో చేసినట్టుగానే.. ఓ భక్తి చానల్‌ కూడా మొదలుపెడదామని అనుకుంటున్నాం. వినుట, స్మరించుట, సేవించుట, కీర్తించుట, పూజించుట, నమస్కరించుట, పరిచరియాలు చేయూట, స్నేహభావంతో ఉండుట, మనో వాక్కాయాలను భగవంతుడికి అర్పించుట.. ఇదే అఖండ సినిమా. ఎక్కువ చెప్పదలుచుకోలేదు సినిమా గురించి. ఆదిదేవుడి ఆశీర్వాదం ఉంది. భారతదేశంలో ఉన్న భక్తిని.. అఖండ సినిమాతో ఇంకా బతికిస్తునందుకు ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు మన కళ్ల ముందు కనిపించే దేవుళ్లు.. వాళ్లు దేవుళ్ల కన్నా ఎక్కువ. నేను ఎక్కువగా ప్రేమించేది నాన్న గారిని. ఆయన నాకు గురువు, దేవుడు. ఆ తర్వాత నేను ప్రేమించేది నా అభిమానులను. విజయాలకు గర్వపడటం.. అపజయాలకు కుంగిపోం. అభిమానుల ఆశీస్సుల పొందగలుగుతున్నామంటే అది పూర్వ జన్మ సుకృతం. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

శ్రీకాంత్ ‌కు హాట్సఫ్. నటన అంటే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం. ఇద్దరు తమ్ముళ్లు.. అల్లు అర్జున్, శ్రీకాంత్‌ను చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. కరోనా కాలంలో కూడా ప్రాణాలను తెగించి షూటింగ్‌లు చేశాం. చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. పుష్ప, రాజమౌళి గారి రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్, చిరంజీవి గారు నటించిన ఆచార్య సినిమాలు విడుదల అవుతున్నాయి. అన్ని సినిమాలు బాగా ఆడాలి. వాటికి రెండు ప్రభుత్వాలు కూడా పూర్తిగా సహకరించాలి. మలయాళంలో బన్నీకి చాక్లెట్ బాయ్ అని పిలుస్తారు. సినిమాకు భాషా బేధం లేదు. మంచి సినిమాలు అందిస్తున్నందుకు మనం గర్వపడాలి. అభిమానులు క్షేమంగా ఇళ్లకు చేరండి. ప్రజా సేవ చేస్తున్న నా అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉంటుంది’ అని అన్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్