ఆశయాల పందిరిలో… అనురాగం సందడిలో ఎదలు రెండు కలిశాయి… ఏటికెదురు నిలిచాయి.. (యువతరం కదిలింది), “నేడే… మేడే’ (ఎర్రమల్లెలు), “మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం”, (నేటి భారతం) వంటి పలు సూపర్ హిట్ గీతాల అభ్యుదయ రచయిత అదృష్టదీపక్ (70) కొవిడ్ చికిత్స పొందుతూ కన్ను మూశారు. వీరికి భార్య, కుమారుడు ఉన్నారు.
మాదాల రవి రూపొందించిన ‘నేను సైతం’ గీత రచయితగా అదృష్ట దీపక్ ఆఖరి చిత్రం. తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం సమీపం… రాయవరం మండలం ‘సోమేశ్వరం’ వీరి స్వస్థలం. అధ్యాపకుడిగా పదవీ విరమణ చేసిన అదృష్టదీపక్ రామచంద్రాపురంలో విశ్రాంత జీవితం గడుపుతూ కొవిడ్ బారినపడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

తెలుగు, జర్నలిజం, పాలిటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో 17 ఏళ్లు పాటు సినిమా జర్నలిస్టుగా అనుభవం. వివిధ సినీ వార పత్రికలు, దిన పత్రిక, ఎలెక్ట్రానిక్ మీడియాలో, వెబ్ సైట్ లో వర్క్ చేసిన అనుభవం.