Wednesday, July 3, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచూడు చూడు అమెరికా- 3

చూడు చూడు అమెరికా- 3

ఉమెన్ రోల్
అమెరికాలో మన తెలుగు మహిళలు ఉద్యోగ ఒత్తిడితో చాలా బిజీ. ఉద్యోగంతో పాటు ఇంటి బాధ్యతల్లో కీ రోల్ వాళ్ళదే. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా నెలకు లక్షల్లో ఉద్యోగం ద్వారా సంపాదిస్తారు. ఉదయం తొమ్మిది నుంచి ఐదు వరకు ఆఫీస్ డ్యూటీ. ఆ తరవాత ఇంటి బాధ్యతల్లో బిజీ అవుతారు. ఇక పిల్లలు ఉన్న వాళ్ళు ఐతే వారికి అదనపు బాధ్యతలు. ఉదయం వాళ్ళను స్కూల్ కి పంపడం తో పాటు జాబ్ కి రెడీ అవ్వాలి. సాయంత్రం ఇంటికి వచ్చాక వాళ్ళను చూసుకోవాలి.

కరోనా తరవాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాక ఇంట్లో వాళ్ళ రోల్ మరింత పెరిగింది. వందలో 90 శాతం మంది మహిళలు జాబ్ చేస్తారు. అందులో 80 శాతం మంది ఐటీ సంబంధిత ఉద్యోగాలే. ఐటీ ఉద్యగం అంటే ఎక్కువ పని గంటలు, ప్రాజెక్ట్ టార్గెట్స్ కామన్. దీంతో ఉద్యోగ ఒత్తిడి… ఇంటి బాధ్యతల్లో అమెరికాలో మన మహిళలు క్షణం తీరిక లేకుండా గడుపుతారు. ఇండియాతో పోల్చితే జెంట్స్ ఇంటి పనులు… వంట పనుల్లో మహిళలకు సాయం చేస్తున్నా మేజర్ రోల్ వారిదే. మనలాగా కుక్, డ్రైవర్, దోబీ, ఇల్లు క్లీన్ చేయడానికి అక్కడ మనుషులు ఉండరు. ఒకవేళ తప్పక పెట్టుకున్నా వాళ్లకు వచ్చే ఆదాయం పనివాళ్ల కి కూడా సరిపోదు . అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి.

ఇక సొంత దేశంలో ఉండే తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులతో రిలేషన్ మేనేజ్ చేయడం వీళ్ళకి మరో ఛాలెంజ్. మనం పడుకునే సమయానికి వాళ్ళు నిద్ర లేస్తారు. మనం లేచే సమయానికి నిద్రపోతారు. ఈ టైమింగ్ కుదరక ఇబ్బంది పడుతుంటారు.

అమెరికా స్కూల్స్
అమెరికాలో ఎడ్యుకేషనల్ కు ఎక్కడాలేని ప్రాధాన్యం ఉంటుంది. అక్కడ నివాసం ఉండే వాళ్ళ పిల్లల చదువు దగ్గర లోని స్కూల్ లో ఉంటుంది. దాదాపు అన్ని ప్రభుత్వ స్కూల్లే . ఫీజులు ఏమీ పెద్దగా ఉండవు. పేదలు… ధనికులు అనే తేడా ఉండదు. అందరికీ ఒకే రకమైన స్కూల్ ఎడ్యుకేషన్. ఉదయం బస్ ఎక్కించేటపుడు.. ఇంటి దగ్గర డ్రాప్ చేసే సమయంలో పేరెంట్స్ ఉండాల్సిందే. లేదా కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఉండాలి. అందుకే ఎక్కడున్నా స్కూల్ బస్ వచ్చే సమయానికి పేరెంట్స్ పిల్లలతో ఉంటారు. స్కూల్ బస్ లకి ప్రత్యేకమైన లైట్ ఉంటుంది. అంతా దారి ఇవ్వాల్సిందే. స్కూల్ పిల్లలు రోడ్డు క్రాస్ చేసే సమయంల స్పెషల్ కేర్ తీసుకుంటారు.

అమెరికాలో పిల్లలను ఎవరూ చెయ్యెత్తి కొట్టరు. చిల్డ్రన్ కి స్పెషల్ రైట్స్ ఉంటాయి. ఏడాది నుంచే ఇంట్లో పిల్లలు సపరేట్ బెడ్ రూంలో పడుకుంటారు. కాలేజీ కి వచ్చాక దాదాపు ఇంట్లో ఉండరు. పార్టీ టైమ్ జాబ్ లు చేస్తూ క్యాంపస్ లోనే గడుపుతారు. అప్పటి నుంచే సొంతంగా బతకడం మొదలు పెడతారు.

అమ్మ – నాన్న
అమెరికా లోని తెలుగు పిల్లలు అంతా మమ్మీ డాడీ అని పిలుస్తారు అనేది ఇప్పుడు నిజo కాదు. ఇండియాలో ఉంటున్న పిల్లలే అమ్మ- నాన్న అని పిలవడానికి మొహమాట పడుతున్నారు. అమెరికాలోని ఇళ్లలో సంభాషణ అంతా ఇంగ్లీష్ లో అమెరికన్ యక్సెంట్ లో మాట్లాడుతున్నా అమ్మ నాన్న ను మాత్రం తెలుగులోనే ముద్దుగా పిలుచుకునే కల్చర్ పెరిగింది. అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య కూడా బాగా పెరిగిందని అక్కడి సర్వే లే చెప్తున్నాయి. ఒకప్పుడు మా వాడికి తెలుగు రాదు అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు తల్లి దండ్రులు. ఇప్పుడు మాత్రం తెలుగు రాదని చెప్పుకోడానికి నామోషీగా ఫీలవుతున్నారు. మనబడి పేరుతో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో తెలుగు టీచ్ చేస్తున్నారు. 2016 లో తెలుగువారి అమెరికాలో 3.2 లక్షల తెలుగువాళ్లు ఉండేవారు. 2024 సగానికి 12.3 లక్షలకు చేరింది.

తెలుగు భాష -సంసృతి
తెలుగు భాష… సంసృతి పై అమెరికాలో స్థిర పడ్డ వారు మక్కువ చూపిస్తున్నారు. ఇళ్లలో ఎక్కువ శాతం తెలుగు లో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలకు తప్పనిసరి తెలుగు నేర్పిస్తున్నారు. ప్రత్యేక క్లాసులకు పంపి తెలుగు వచ్చేలా చూస్తున్నారు. అంతేకాదు అమ్మాయి లైతే కూచిపూడి, భరత నాట్యం నేర్చుకుంటున్నారు. ఏ సందర్భం వచ్చినా నాట్య ప్రదర్శన ఉండేలా చూస్తున్నారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పండుగలు చేస్తున్నారు. కన్న ఊరు కి దూరమైనా తెలుగు కల్చర్ కి దూరం కాకుండా జీవనం సాగిస్తున్నారు.

20 గంటలు జర్నీ
ఎన్నిసార్లు అమెరికాకు వెళ్ళినా టైమింగ్ మాత్రం గమ్మత్తుగా అనిపిస్తుంది. కనీసం పదహారు గంటల పాటు ప్రయాణం పడుతుంది. మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్ ఐతే మరో ఐదు గంటలు మొత్తం 20 గంటలు ప్రయాణానికి పోతుంది. తొలిసారి ఇన్ని గంటలు ఫ్లైట్లో ప్రయాణం చేసే వారికి మాత్రం ఎప్పుడు తెళ్ళా రింది ఎప్పుడు చీకటి పడిందో అర్థం కాదు. దుబాయ్ కి మనకి రెండున్నర గంటల సమయం వ్యత్యాసం ఉంటుంది. అమెరికాకు తొమ్మిది పది గంటల సమయం తేడా ఉండటంతో తికమక కు గురవుతారు. అమెరికాలో మూడు టైమ్ జోన్స్ ఉన్నాయి. విస్తీర్ణంలో అతిపెద్దది కావడం వల్ల మూడు జోన్లను ఫోలో అవుతారు. వాషంగ్టన్ కు మనకు తొమ్మిదిన్నర గంటల వ్యత్యాసం ఉంటే అదే కాలిఫోర్నియా కు 11 గంటల తేడా ఉంది.

ఇళ్ల ధరలు విపరీతం
అమెరికాలో ఇంటి ధరలు చాలా ఎక్కువ. ఒక ఇంటి ధర పది నుంచి 15 కోట్ల రూపాయలు ఉంటుంది. టౌన్ హోమ్, ఇండిపెండెంట్ ఫ్యామిలీ అని రెండు రకాలు ఉంటాయి. ఒక ఇంటితో మరో ఇంటికి సంబంధం లేకుండా ఉండే కాలనీ ఇండిపెండెంట్ ఫ్యామిలీ హౌస్. ఒకదానికి మరొకటి ఆనుకుని ఉంటే టౌన్ హోమ్ అంటారు. ఇండిపెండెంట్ ఫ్యామిలీ హౌస్ తో పోల్చితే టౌన్ హోమ్ తక్కువ ధర ఉంటుంది. అందుకే అమెరికాలో ఇల్లు కొనడం అంటే కోట్ల రూపాయల వ్యవహారం. టౌన్ హోమ్ నెల రెంటు కనీసం రెండున్నర లక్షలు ఉంటుంది.

రాష్ట్రాన్ని బట్టి… ప్రాంతాన్ని బట్టి రేట్లు మారడం సహజం. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటున్న వర్జీనియా, డల్లాస్, కాలిఫోర్నియా ల్లో ఇలా ఉంది. ఇల్లు కొన్న ప్రతి ఒక్కరూ లోన్ తీసుకుంటారు. అమెరికాలో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ. ఒకప్పుడు రెండు శాతం ఉండేది.. ప్రస్తుతం అది ఏడు శాతం వరకు పెరిగింది. ప్రతి కౌంటీ లో వాకింగ్ ట్రాక్ తప్పనిసరి ఉంటుంది.

టోల్ రేట్
అమెరికాలో టోల్ గేట్ ఫీజు ఫిక్సెడ్ గా ఉండదు. టైమింగ్, ట్రాఫిక్ ను బట్టి టోల్ ఛార్జీ వసూలు చేస్తారు. దూరాన్ని బట్టి మాత్రమే కాదు.. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఫీ కలెక్ట్ చేస్తారు. కనీసం టోల్ ఫీజు ఏడు ఎనిమిది డాలర్లు ఉంటుంది.

ఐఫోన్
అమెరికాలో పుట్టిన ఐఫోన్ ప్రపంచంలో చాలా పాపులర్. ఇండియాలో ఎవరి చేతిలో చూసినా ఐఫోన్ కనిపిస్తుంది. ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని ఐఫోన్ లు కూడా ఉన్నాయంటే ఆశ్చర్య ఓ లేదు. అమెరికాలో స్థిరపడ్డ తెలుగు వాళ్ళ చాలా మంది ఇళ్లలో ఐఫోన్ కనిపించదు. యూజర్ ఫ్రెండ్లీ కాదని కొందరు… లక్ష కు పైగా ఖర్చు అవసరం లేదని మరికొందరు వాడట్లేదు.

-సోమగోపాల్ కడిమెట్ల
99483 75129

RELATED ARTICLES

Most Popular

న్యూస్