Friday, April 18, 2025
HomeTrending NewsEthanol Project:గృహ నిర్బంధంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Ethanol Project:గృహ నిర్బంధంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లాలో ఇథనాల్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయవద్దంటూ పాసిగాం గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజలు కొద్దిరోజులుగా అందోళన కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన ఆందోళనలు ఉదృతం అయ్యాయి. ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాసిగాం బాధితులతో మాట్లాడేందుకు గురువారం వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని జగిత్యాల టౌన్ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మన్ కుమార్ ను ధర్మపురి పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు పలువురు  కాంగ్రెస్ నాయకులను కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్