Monday, March 16, 2026
HomeTrending Newsరాజమండ్రిలో ఉద్రిక్తత

రాజమండ్రిలో ఉద్రిక్తత

అమరావతి మహా పాదయాత్ర రాజమండ్రికి చేరుకున్న సంగతి తెలిసిందే. నేడు ఉదయం ఈ ర్యాలీ  నగరంలోని ఆజాద్ చౌక్ కు చేరుకోగానే, వైసీపీ నేతలు, కార్యకర్తలు వికేంద్రీకరణకు మద్దతుగా రైతుల యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మూడు రాజధానులు కావాలని, అమరావతికి వ్యతిరేకంగా నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్యా తీవ్ర తోపులాట జరిగింది. పరస్పరం కుర్చీలు, రాళ్ళు, చెప్పులు విసురుకున్నారు.  పోలీసులు రంగంలోకి దిగి  ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.  వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular