భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నూతన అధ్యక్షుడిగా క్రికెట్ మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో  అయన ఎన్నికను ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం లాంఛనంగా ప్రకటించింది.

67ఏళ్ళ వయసున్న బిసిసిఐకి 36వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 1983లో  కపిల్ దేవ్ నేతృత్వంలో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో బిన్నీ సభ్యుడిగా ఉన్నారు.  ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన బిన్నీ  బౌలింగ్ లో విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ వికెట్ తీశాడు.

ప్రస్తుత అధ్యక్షుడు గంగూలీ స్థానంలో బిన్నీ బాధ్యతలు  చేపట్టనున్నాడు. ప్రస్తుతం కర్నాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బిన్నీ కొనసాగుతున్నాడు.

Also Read :

క్రికెట్ కొలనులో కమలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *