Saturday, May 3, 2025
HomeTrending Newsపశ్చిమ టెక్సాస్ లో భూకంపం

పశ్చిమ టెక్సాస్ లో భూకంపం

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) టెక్సాస్‌లోని మిడ్‌లాండ్‌ పట్టణంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. మిడ్‌లాండ్‌కు 22 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 9 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొన్నది.

భూకంపంతో కొన్ని పగుళ్ళు వచ్చినా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని ప్రాథమిక సమాచారం. నెల రోజుల్లో ఇది రెండోసారి కావటం గమనార్హం. టెక్సాస్ చరిత్రలో ఇది నాలుగో భారీ భుకంపంగా శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. భూకంప ప్రభావంతో పశ్చిమ టెక్సాస్ లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్