Saturday, January 18, 2025
HomeTrending Newsటెక్సాస్‌లో సంచలనం..ట్రక్కులో 42 మృతదేహాలు

టెక్సాస్‌లో సంచలనం..ట్రక్కులో 42 మృతదేహాలు

అమెరికాలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో సోమవారం ఓ ట్రాక్టర్-ట్రైలర్‌లో కనీసం 40 మంది చనిపోయి కనిపించారని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి తెలిపారు. శాన్ ఆంటోనియోలోని రైలు పట్టాల పక్కన ఓ ట్రక్కులో 42 మంది మరణించి ఉన్నట్లు కనుగొన్నారు. కోన ఉపిరితో ఉన్న మరో 16 మందిని ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ట్రక్ అక్కడికి ఎలా వచ్చిందో విచారణ చేపట్టారు. అంత మంది విగత జీవులుగా మారడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

KSAT టెలివిజన్ కథనం ప్రకారం.. శాన్ ఆంటోనియో నగరం దక్షిణ శివార్లలోని మారుమూల ప్రాంతంలో రైలు పట్టాల పక్కన ఈ ట్రక్కు కనిపించింది. దీని మీద స్పందించడానికి శాన్ ఆంటోనియో పోలీసులు వెంటనే అందుబాటులోకి రాలేదని తెలిపింది. ఈ ఘటన మీద KSAT రిపోర్టర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటోలలో పెద్ద ట్రక్కు..దాని చుట్టూ పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లను కనిపిస్తున్నాయి. మెక్సికన్ సరిహద్దు నుండి 160 మైళ్ళు (250 కిమీ) దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోలో ఉష్ణోగ్రతలు సోమవారం అధిక తేమతో 103 డిగ్రీల ఫారెన్‌హీట్ (39.4 డిగ్రీల సెల్సియస్) వరకు పెరిగాయి.

Also Read : టెక్సాస్ స్కూల్ లో కాల్పులు..21 మంది మృతి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్