Friday, November 22, 2024
HomeTrending Newsఅస్సాం ప్రభుత్వం వినూత్న ఆలోచన

అస్సాం ప్రభుత్వం వినూత్న ఆలోచన

అస్సాం ప్రభుత్వం సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారతరత్న, పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలకు ధీటుగా అస్సాంరత్న ఇస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే సంవత్సరం నుంచే వీటిని అందచేస్తామని వెల్లడించింది.

గౌహతిలో ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ  నేతృత్వంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో అవార్డులు అంశానికి  ఏకగ్రీవంగా ఆమోదం లభించిందని క్యాబినెట్ మంత్రి పిజుష్ హజారిక వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలకు రాష్ట్ర స్థాయిలో ఇచ్చే ఈ అవార్డులు కొనసాగింపుగా ఉంటాయని మంత్రి  సమర్థించుకొన్నారు.

సమాజంలో అత్యున్నత సేవలు అందించిన వారిని ఎంపిక చేసి ప్రతి ఏడాది ఒకరికి అస్సాంరత్న అవార్డు తో పాటు ఇదు లక్షల నగదు అందిస్తారు. అస్సాం విభూషణ్ కు ప్రతి సంవత్సరం ముగ్గురిని ఎంపిక చేసి ఒకరికి మూడు లక్షల చొప్పున, అస్సాం భూషణ్ కోసం ఐదుగురిని ఎంపిక చేసి రెండు లక్షల చొప్పున, అస్సాంశ్రీ కోసం పదిమందిని ఎంపిక చేసి లక్ష రూపాయల చొప్పున్ నగదు ఇస్తారు.

కొత్త ప్రభుత్వం భాద్యతలు చేపట్టాక ఈ నెల 12 వ తేది నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవార్డుల నిర్ణయం చర్చనీయంగా మారింది. కరోన మహమ్మారి, బ్రహ్మపుత్ర వరదలు, కుండపోత వర్షాలతో ప్రజలు క్షణ మొక యుగంగా గడుపుతున్నారని ప్రతి పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, ఈ సమయంలో అవార్డులు ఎవరి మెప్పు కోసం ప్రభుత్వం ఇస్తోందని, కేవలం ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్