Sunday, January 19, 2025
HomeTrending Newsనకిలీ ఎస్.బి.ఐ. కాల్ సెంటర్ గుట్టు రట్టు

నకిలీ ఎస్.బి.ఐ. కాల్ సెంటర్ గుట్టు రట్టు

The Biggest Cyber Fraud In The Country :

ఎస్‌బీఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నుంచి ఎస్బిఐ బ్యాంక్ ఉద్యోగులమంటూ అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెట్టి కోట్లు దండుకుంటున్న14 మంది ఘరానా ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సందర్భంగా గురువారం  సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు ఢిల్లీ కేంద్రంగా నగరంలో ఎస్‌బిఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్నారనే పక్క సమాచారం తెలుసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 14 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం కాల్ సెంటర్‌ ఖాతాల్లోని లక్షల రూపాయల నగదు నిలుపుదల చేశారు.

దేశంలోనే అతిపెద్ద సైబర్‌ మోసాన్ని ఛేదించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఎస్‌బీఐ ధనీ బజార్‌, ద లోన్ ఇండియా, లోన్‌ బజార్ పేర్లతో నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రూ.వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. స్ఫూపింగ్‌ యాప్‌ ద్వారా ఎస్‌బీఐ అసలైన కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు.
ఓ ముఠా దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఎస్‌బీఐ నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ కాల్‌సెంటర్‌ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33 వేల కాల్స్ చేసి రూ.కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదైనట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఎస్‌బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాల తీసుకొని క్రెడిట్‌కార్డు దారుల నుంచి ముఠా డబ్బులు కాజేస్తున్నట్లు చెప్పారు. అసలైన ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ వచ్చినట్లు భ్రమింప జేసేందుకు స్ఫూఫింగ్‌ యాప్‌ వాడుతున్నారని.. ఈ యాప్‌ వాడకంలో ఫర్మాన్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని సీపీ తెలిపారు. 1860 180 1290 అనే నంబరును స్ఫూపింగ్ చేస్తున్నట్లు వివరించారు. 14 మంది నిందితులను అరెస్టు చేసి 30సెల్‌ఫోన్లు, 3ల్యాప్‌టాప్‌లు, కారు, బైకు, 1 రూటర్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్…

ధనీ, లోన్‌ బజార్‌ పేరుతో రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అభిషేక్ మిశ్రా నకిలీ యాప్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకొని ఆ తర్వాత రుణం మంజూరైనట్లు చెబుతారని.. ప్రొసెసింగ్‌ ఫీజు పేరిట అధిక మొత్తంలో నగదు తీసుకుంటున్నారని వివరించారు. ఈ ముఠాలో 14 మందిని అరెస్టు చేసి నిందితుల వద్ద నుంచి 17 స్మార్ట్ ఫోన్లు, 20 బేసిక్ ఫోన్లు, 3ల్యాప్‌టాప్‌లు, 5సిమ్‌కార్డులు,3 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్155260 కు కానీ, 100 కానీ, 9490617310 సైబరాబాద్ సైబర్ క్రైమ్ వాట్సాప్ నంబర్ కు వాట్స్అప్ చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ క్రైమ్స్ డిసిపి రోహిణి ప్రియదర్శిని, డిసిపి లావణ్య సైబర్ క్రైమ్స్, శ్రీధర్ ఏసిపి సైబర్ పాయింట్స్ తోపాటు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలుతోపాటు పలువురు పాల్గొన్నారు.

Also Read : వరద బాధితులకు సిఎం జగన్ భరోసా

RELATED ARTICLES

Most Popular

న్యూస్