Saturday, November 23, 2024
HomeTrending Newsబస్సు చార్జీలు పెంచితే పోరాటమే

బస్సు చార్జీలు పెంచితే పోరాటమే

కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నాలుగు వందల మంది రైతులు కేవలం సిద్దిపేటలోనే చనిపోయారని, రైతులు చనిపోతుంటే కెసిఆర్ ఎం చేస్తున్నారని ఎంపి ధర్మపురి అరవింద్ ఈ  రోజు ఢిల్లీలో ప్రశ్నించారు. పారబాయిల్ద్ రైస్ సాగు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి చెపుతోంది. తెరాస ఎంపిలు పార్లమెంటులో ఎందుకు ధర్నా చేస్తున్నారు, కెసిఆర్ ఇంటి ముందు ఎంపిలు ధర్నా చేయాలి. దళితబంధు పథకం నవంబర్ లో రాష్ట్రమంతా ప్రవేశ పెడతామని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు మొండికేశారు. దళితబందు అమలు చేసే ఉద్దేశం కెసిఆర్ లేదని అరవింద్ విమర్శించారు.

తెలంగాణ రైతాంగానికి చేసినంత మేలు కేంద్రప్రభుత్వం ఏ రాష్ట్రానికి చేయలేదని అరవింద్ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం నుంచి మూడు వందల శాతం ఎక్కువగా ధాన్యం సేకరణ కేంద్రం చేసిందన్నారు. 2016 లో 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేస్తే 2020లో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసిందన్నారు. ఇన్నాళ్ళు మక్క (మొక్కజొన్న ) వేయొద్దు అన్న కెసిఆర్ ఇప్పుడు మళ్ళీ మక్క వేయాలని చెప్పేందుకు సిద్దం అయినట్టు తెలిసిందన్నారు.

ఆర్టిసి చార్జీలు పెంచితే ఒప్పుకునేది లేదని, పెట్రోలు మీద వ్యాట్ తగ్గించాలని ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. ఆర్.టి.సి. చార్జీలు పెంచితే సామాన్యుల తరపున పోరాటం చేస్తామని అరవింద్ హెచ్చరించారు. కేంద్రం పెట్రోలుపై పన్ను తగ్గిస్తే నేను తగ్గిస్తానన్న కెసిఆర్ ఇప్పటి వరకు ఆ పని చేయలేదని విమర్శించారు. తెలంగాణలో అవినీతికి కేరాఫ్ గా మారిన కెసిఆర్ జైలుకు వెళ్ళటం ఖాయమని, వంద శాతం కెసిఆర్ జైలుకు వెళతారని అరవింద్ అన్నారు.

Also Read : ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదన

RELATED ARTICLES

Most Popular

న్యూస్