Friday, September 20, 2024
HomeTrending Newsరేపటి నుంచి చార్ ధాం యాత్ర

రేపటి నుంచి చార్ ధాం యాత్ర

చార్ ధాం యాత్రకు రేపటి నుంచి అనుమతిస్తున్నట్టు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. చార్ ధాం యాత్రకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉత్తరఖండ్ ప్రభుత్వం యాత్రికుల సౌకర్యాలపై దృష్టి సారించింది.  కోవిడ్ నిభందనలకు అనుగుణంగా భక్తులు చార్ ధాం యాత్రకు రావచ్చని ముఖ్యమంత్రి ధామి డెహ్రాడున్ లో చెప్పారు.

వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారిని మాత్రమె అనుమతిస్తామని, తగిన ధ్రువ పత్రాలు యాత్ర సమయంలో దాఖలు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిభందన పెట్టింది. కరోనా నిభందనలు పక్కాగా అమలు చేయాలని హై కోర్ట్ షరతు విధించింది. దీంతో ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. చమోలి, ఉత్తరకాశి, పౌరి, రుద్రప్రయాగ జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు.

ప్రముఖ పుణ్యక్షేత్రాలు బద్రినాథ్, కేదార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి దేవాలయాలకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను కలిపి చార్ ధాం యాత్ర గా చెప్పుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్