Saturday, November 23, 2024
HomeTrending Newsసందిగ్ధంలో పార్లమెంటు సమావేశాలు

సందిగ్ధంలో పార్లమెంటు సమావేశాలు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఈరోజు 1,59,692  కేసులు నమోదు కాగా పజితివితి రేటు 10.21 గ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, చట్టసభలు, కోర్టుల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు సైతం వైరస్ బారిన పడ్డారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో వైరస్ కేసులు నమోదు కావడంతో అక్కడ పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికి కూడా టెస్టులు నిర్వహించారు. 150 మంది స్టాప్ ను క్వారంటైన్ కు తరలించారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టీస్ సహా మొత్తం 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో నలుగురికి వైరస్ సోకింది. సుప్రీంకోర్టు అధికారిక సమాచారం ప్రకారం.. జ్వరం బాధపడుతున్న న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫేర్ వెల్ పార్టీకి హాజరయ్యారు. ఆ తర్వాత ఆ న్యాయమూర్తి కొవిడ్ బారిన పడ్డారు.

పార్లమెంట్ లో కరోనా కేసులు వెలుగుచూశాయి. పార్లమెంట్‌లో పనిచేసే 402 మందికి కొవిడ్ సొకింది. మొత్తం 1,409 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తే.. వారిలో 402 మంది సిబందికి పాజిటివ్‎గా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. పాజిటివ్ వచ్చిన వారిలో 200 మంది లోక్‎సభ సిబ్బంది ఉంటే.. 69 మంది రాజ్యసభ సిబ్బంది ఉన్నారు. మిగతా 133 మంది సిబ్బంది ఇతర స్టాఫ్‎గా అధికారులు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన వారితో పాటు.. కాంటాక్ట్‎లను గుర్తించి హోం ఐసోలేషన్ కు తరలించారు. కాగా.. ఫిబ్రవరి 1నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు సిబ్బందికి కరోనా సోకడంతో సమావేశాలపై సందిగ్ధత నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్