Sunday, February 23, 2025
HomeTrending Newsయుకెలో 45 వేల కేసులు

యుకెలో 45 వేల కేసులు

Corona Is Spreading Rapidly :

మహమ్మారి మళ్ళీ  విశ్వరూపం ధరిస్తోంది. యూరోప్ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. జర్మేనీలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఉన్న కోవిడ్  ఇప్పుడు ఇంగ్లాండ్ ను కుదిపేస్తోంది.  యుకె లో ఒక రోజే సుమారు 45 వేల కేసులు నమోదయ్యాయి. అయితే కరోనాతో చనిపోయే వారి సంఖ్య తక్కువగా ఉండటం ఆశించతగిన పరిణామం. కేసుల పరంగా ఎక్కువగా ఉన్న మృతులు రోజుకు 45 మంది చనిపోతున్నారని, ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ దేశ ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

బ్రిటన్ లో కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారు 80 శాతం ఉండగా ఒక డోసు తీసుకున్న వారు 88 శాతం ఉన్నారు. మూడో డోసు తీసుకున్న వారు 26 శాతం ఉన్నారు. బ్రిటన్, జర్మనీ, అమెరికా,చైనా, రష్యా తదితర దేశాల్లో మూడో డోసు (బూస్టర్ డోసు) ఇచ్చేందుకు మరింత పకడ్బందీగా ప్రణాలికలు రూపొందిస్తున్నారు. ఈ దేశాల్లో కరోనా కేసులు కొంత ఎక్కువగా నమోదు కావటం ప్రపంచ ఆరోగ్య సంస్థను కలవరపరుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్