Saturday, January 18, 2025
HomeTrending Newsబ్రోకర్లు,జోకర్లే విమర్శిస్తున్నారు

బ్రోకర్లు,జోకర్లే విమర్శిస్తున్నారు

రాష్ట్రంలో కెసిఆర్ మీద మాట్లాడే వాళ్ళు మూడు కేటగిరిల వాళ్ళు బ్రోకర్లు ,జోకర్లు ,లోఫర్లు అని పీయూసీ చైర్మన్ ,ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విమర్శించారు. బ్రోకర్ రేవంత్ రెడ్డి ,జోకర్ బండి సంజయ్ ,లోఫర్ ఎంపీ అరవింద్ అని ఎద్దేవా చేశారు. దళితబంధు ప్రపంచంలోనే అత్యుత్తమ పథకమని టీ.ఆర్.ఎస్.ఎల్పి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి కొనియాడారు. దళిత బంధు అమలైతే తమకు పుట్టగతులుండవని బ్రోకర్లు ,లోఫర్లు ,జోకర్లు కెసిఆర్ మీద మాట్లాడుతున్నారని, కెసిఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు ..ఇది తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.

కెసిఆర్ ఏ పథకం తెచ్చినా ప్రతిపక్షాలకు అనుమానమే ..అయినా పథకాలు విజయవంతం అవుతున్నాయన్న జీవన్ రెడ్డి మా అందరికీ తల్లి లాంటి శోభమ్మను కూడా రాజకీయాల్లోకి రేవంత్ లాగడం శోచనీయమన్నారు. .దమ్ముంటే కాంగ్రెస్ ,బీజేపీ నేతలు తమ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేయాలని సవాల్ విసిరారు. కెసిఆర్ ఓ విజ్ఞాని ..రేవంత్ ఓ అజ్ఞాని అన్నారు. దళిత బంధుతో రేవంత్ లాంటి నేతల చిన్న మెదడు చిప్ పాడైందని, తమ దుకాణాలు బంద్ అయితాయనే అక్కసు తో రేవంత్ ,బండి సంజయ్ మాట్లాడుతున్నారన్నారు.

దళిత బంధు తర్వాత కాంగ్రెస్ ,బీజేపీ కార్యాలయాలకు టు లెట్ బోర్డు తగిలించుకోవాల్సిందేనని, బండి సంజయ్ దరఖాస్తుల ఉద్యమం ఓ జోక్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అడ్డదిడ్డంగా మాట్లాడి అభాసు పాలైంది బండి సంజయ్ అని జీవన్ రెడ్డి విమర్శించారు. మోడీ హామీల గురించి దరఖాస్తులు తీసుకో బండి సంజయ్ అని హితవు పలికారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మతపరంగా విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, నిజామాబాద్ అంబెడ్కర్ చౌరస్తా లో అరవింద్ బట్టలు విప్పి ఊరేగించే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

హుజురాబాద్ లో సీఎం కెసిఆర్ రాజకీయాలు మాట్లాడలేదని, రేవంత్ ది మయోపిక్ మైండ్ అని జీవన్ రెడ్డి అన్నారు. మయోపిక్ అంటే దూరదృష్టి లేని వాడని అర్థమని, రైతు బంధు కు నిధులున్నట్టే దళిత బంధు కు నిధులున్నాయన్నారు. హుజురాబాద్ లో గెలిచేది మేమె అన్న జీవన్ రెడ్డి రెండేళ్లలో దళిత బంధు దేశమంతా తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడి పెరగడం ఖాయమన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్