కాకతీయ వైద్య కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యేనని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు. ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు డెత్ రిపోర్టులో తేలినట్టు ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో మీడియా ప్రతినిధులు ప్రీతి మృతి విషయంలో అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానం ఇచ్చారు. ‘ప్రీతిది ఆత్మహత్యే, డెత్ రిపోర్ట్‌లో నిర్ధారణ అయింది, ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు సైఫ్. అతడిపై ఆత్మహత్య ప్రేరేపణ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం’ అని సీపీ పేర్కొన్నారు.