The Decision Of The Peasant Unions Today On The Activity Of The Movement :
ఢిల్లీలో ఏడాది నుంచి ఆందోళన కొనసాగిస్తున్న రైతులు ఈ రోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. హస్తినలో సమావేశం అవుతున్న సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు తాజా పరిణామాలపై నిర్ణయం తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సాగు చట్టాలు ఉపసంహరించుకున్న నేపథ్యంలో రైతుల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. నవంబర్ 29వ తేదిన పార్లమెంటుకు ట్రాక్టర్లతో ర్యాలీగా రావాలని కిసాన్ మోర్చా గతంలో పిలుపు ఇచ్చింది. అయితే ఆ తర్వాత కేంద్రం ధోరణి మారటం,రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసినా కనీస మద్దతు ధర చట్టంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. మూడు చట్టాలు ఇప్పుడు వెనక్కి తీసుకున్నా వాటిని వేరే రూపంలో మళ్ళీ తీసుకొస్తారనే అనుమానం రైతు సంఘాల్లో ఉంది.
పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గిందని, సాగు చట్టాలను ఎదో ఒక విధంగా రుద్దాలనే ఆలోచన బిజెపి చేస్తోందని ఇదివరకే భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఆరోపించారు. కనీస మద్దతు ధర చట్టం తీసుకొచ్చే వరకు రైతు ఉద్యమం కొనసాగే అవకాశం ఉంది. ఆందోళన ఏ రూపంలో కొనసాగాలన్నది ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. 2020 సంవత్సరం నవంబర్ 26న ప్రారంభమైన రైతు ఉద్యమం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఏడాది పాటు జరగటంతో దేశ ప్రజలతో పాటు అంతర్జాతీయంగా కూడా చర్చకు దారితీసింది.
Also Read : భారతంలోనూ మధ్యవర్తిత్వం: జస్టిస్ రమణ