Monday, March 10, 2025
HomeTrending Newsగడ్డి అన్నారం మార్కెట్ తరలించాల్సిందే

గడ్డి అన్నారం మార్కెట్ తరలించాల్సిందే

Fruit Market  : గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. మార్కెట్ తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవచ్చునని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వెళ్లేందుకు వ్యాపారులకు నెల గడువు ఇవ్చ్చివాలని, అయితే  నెల రోజుల్లో ప్రభుత్వం బాటసింగారంలో పూర్తి సదుపాయాలు కల్పించాలని హైకోర్టు పేర్కొంది. ఆదేశాలిచ్చినా వ్యాపారులను మార్కెట్ లోకి అనుమతించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి. కౌంటర్లు దాఖలు చేయని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటి ఛైర్మన్, కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేసిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఛైర్మన్ ముత్యంరెడ్డి, కార్యదర్శి పి.హర్షలకు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది.

Also Read : కొనుగోళ్లు పూర్తైన వెంటనే రైతులకు డబ్బులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్