Wednesday, June 10, 2026
Homeసినిమారెజీనా, నివేదా థామస్ ‘శాకిని డాకిని’ ఫస్ట్ లుక్

రెజీనా, నివేదా థామస్ ‘శాకిని డాకిని’ ఫస్ట్ లుక్

Shakini Dakini:
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రెండో చిత్రంగా ‘శాకిని డాకిని’ ప్రాజెక్ట్‌ ను రూపొందిస్తున్నారు. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

నివేదా థామస్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 2న విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. నేడు రెజీనా పుట్టిన రోజు సందర్బంగా మేకర్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రెజానీ, నివేదా థామస్‌లు ఇద్దరూ కూడా మిలటరీ యూనిఫాంలో ఉన్నారు. ఏదో తప్పు చేసి దొరికినట్టు, పనిష్మెంట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. పోస్టర్‌ను చూస్తుంటే సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్లు ఇద్దరూ కూడా మొదటిసారిగా యాక్షన్ సీక్వెన్స్‌ లు చేశారు.

‘మిస్ గ్రానీ’ యూనివర్సల్ కథ కావడంతో ‘ఓ బేబీ’గా రీమేక్ చేయడంతో అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ‘మిడ్ నైట్ రన్నర్స్’ కథ కూడా గ్లోబల్ అప్పిల్ ఉంటుంది. ఇది తెలుగు ఆడియెన్స్‌ కు కనెక్ట్ అయ్యే కథే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఈ చిత్రానికి రచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read : కమల పాత్రతో ప్రేమలో పడ్డాను : శ్రియా సరన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular