Friday, April 19, 2024
Homeసినిమాఫిబ్రవరిలో సత్యదేవ్, తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’

ఫిబ్రవరిలో సత్యదేవ్, తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’

Gurthunda Seethakalam :
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేఖ‌ర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విష‌యాల్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్… ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌లు ప్రేక్ష‌కుల‌కి గుర్తు చేసే ఉద్దేశంతో నాగ‌శేఖ‌ర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇప్ప‌టికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మేఘా ఆకాష్, కావ్య‌శెట్టి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ‘గుర్తుందా శీతాకాలం చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో సత్యదేవ్, తమన్నా ఒకర్నొకరు రొమాంటిక్‌గా చూసుకుంటూ చేతులు కలుపుకుని ఉన్నారు. ఈ ఫోటో అభిమానులకే కాదు అందరికీ బాగా నచ్చేస్తుంది. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 2022లో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు.

Also Read : ‘శ్యామ్ సింగ రాయ్’ కథకు తగ్గట్టుగానే మ్యూజిక్ – మిక్కీ జే మేయర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్