Friday, June 12, 2026
Homeసినిమా25న 'ది ఘోస్ట్' ప్రీరిలీజ్ ఈవెంట్

25న ‘ది ఘోస్ట్’ ప్రీరిలీజ్ ఈవెంట్

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్షన్ థ్రిల్లర్’ ది ఘోస్ట్‘ ప్రమోషన్స్ ఇప్పటికే జోరందుకున్నాయి. నాగార్జున- సోనాల్ చౌహాన్ ల అద్భుతమైన కెమిస్ట్రీతో యువతను ఆకట్టుకున్న ఫస్ట్ సింగిల్ ‘వేగం’తో మ్యూజిక్ ప్రమోషన్లు కూడా చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా జరగనుంది. కర్నూలులోని ఎస్టీబీసీ మైదానం ఈ వేడుకకు వేదికైంది.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. భరత్‌, సౌరబ్‌ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

Also Read: ది ఘోస్ట్& ఫస్ట్ సింగిల్ వేగం విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular