Sunday, January 19, 2025
HomeTrending NewsFloods : ఉత్తరాఖండ్ లో పోటెత్తిన నదులు...కొండప్రాంతాలకు ముప్పు

Floods : ఉత్తరాఖండ్ లో పోటెత్తిన నదులు…కొండప్రాంతాలకు ముప్పు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు వరదలు సంభవించాయి. పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరద నీటిలో ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు పౌరీ గర్హ్వాల్‌ జిల్లాలోని మోటాధక్‌ గ్రామంలోని మలాన్‌ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదికి అడ్డంగా ఉన్న ఓ వంతెన ఇటీవలే విరిగిపోయింది. దీంతో అటుగా వెళ్లే వాహనాలు నది గుండా వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ ట్రక్కు నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో అక్కడే ఇరుక్కుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ మేరకు రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆగస్టు 22 తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.

అటు హిమాచల్ ప్ర‌దేశ్‌లోని షిమ్లాలోని ఇండియ‌న్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్ట‌డీ(IIAS) సెంట‌ర్ కుంచించుకుపోతున్న‌ది. ఇన్స్‌టిట్యూట్ బిల్డింగ్ ఉన్న ప్రాంతం వ‌ద్ద‌.. భారీగా కొండ‌చ‌రియ‌లు విరిగాయి. బిల్డింగ్ చుట్టు ఉన్న లాన్ ప‌రిస‌రాల్లోనే.. రెండు రోజుల క్రితం కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. అక్క‌డ ఉన్న మ‌ట్టి కింద‌కు జారిపోవ‌డం వ‌ల్లే.. స‌మ్మ‌ర్ హిల్ ప్రాంతంలో ఉన్న శివాల‌యం శిధిల‌మైంది. ఆ ఆల‌యంలో సుమారు 20 మంది వ‌ర‌కు స‌జీవ స‌మాధి అయిన విష‌యం తెలిసిందే.

ఇన్స్‌టిట్యూట్‌కు ఉన్న ఫెన్సింగ్ కూడా మ‌ట్టిచ‌రియ‌ల్లో కొట్టుకుపోయింది. దీంతో పాటు ప‌చ్చిక మైదానంలో ఉన్న చాలా వ‌ర‌కు దేవ‌ద‌ర్ వృక్షాలు కూడా నేల‌మ‌ట్టం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఐఐఏఎస్ కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. ఇన్స్‌టిట్యూట్ భ‌ద్ర‌త కోసం ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. స్టేట్ డిజాస్ట‌ర్ అథారిటీతో పాటు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

వాస్త‌వానికి ఐఐఏఎస్ వ‌ద్ద కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన లాన్ దిశ‌లో ప్లాసిక్ షీట్ల‌ను అమ‌ర్చారు. కొండ‌చ‌రియ‌ల తీవ్ర‌త‌కు కింద ఉన్న రోడ్లు, రైల్వే ట్రాక్ కొట్టుకుపోయాయి. శివాల‌యం కూడా ఆ మ‌ట్టిలోనే ధ్వంస‌మైంది. ఐఐఏఎస్ నుంచి దాదాపు 800 మీట‌ర్ల కింద‌కు కొండ‌చ‌రియ‌లు కొట్టుకుపోయాయి.  ఐఐఏఎస్ ప‌రిస‌రాల్లో ఉన్న ఓ రోడ్డు కూడా కృంగిపోతున్న‌ట్లు అధికారులు చెప్పారు.

క్లౌడ్ బ‌స్ట్ వ‌ల్లే కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన‌ట్లు భావిస్తున్నా.. వాతావరణ శాఖ మాత్రం దానికి భిన్నంగా అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తోంది. క్లౌడ్ బ‌స్ట్ అయ్యేంత రేంజ్‌లో వ‌ర్షం ప‌డ‌లేద‌ని, కొండ‌పై మ‌ట్టి చాలా విశాల విస్తీర్ణంలో కొట్టుకుపోతొందన్నారు. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డ స‌మ్మ‌ర్ హిల్ ప్రాంతంలో ఇవాళ ఉద‌యం కూడా రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. శిథిలాల‌ను తొల‌గిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్