Sunday, February 2, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమన సినిమా చరిత్ర-3

మన సినిమా చరిత్ర-3

  • మూకీల నుంచి టాకీల దాకా శతాధిక వసంతాల భారతీయ సినిమా పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి?
  • తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ తెర వెనుక కథ ఏమిటి?
  • మనం వదిలేసిన మన తెలుగు సినిమా ‘కాళిదాస్’ చరిత్రేమిటి?
  • వెండితెరపై వినిపించిన తొలి తెలుగు సినిమా పాటలు అచ్చమైన త్యాగరాయ కీర్తనలా?
  • ఆఖరిరోజుల్లో అష్టకష్టాలు పడ్డ తొలి టాప్ హీరోయిన్ ఎవరు?

  • తొలి పూర్తి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’ అసలు రిలీజు తేదీ ఏమిటి? అలా ఎనభయ్యేళ్ళ తెలుగు సినీ చరిత్రను మార్చేసిన రెంటాల జయదేవ పరిశోధన ఏమిటి?
  • పూర్తి టాకీల్లో తెలుగు తర్వాతే తమిళమని తెలుసా?
  • దక్షిణ భారతీయ టాకీపిత హెచ్.ఎం. రెడ్డి కథ ఏమిటి?
  • తొలి కన్నడ టాకీ తీసింది తెలుగువాడేనని తెలుసా?
  • మలయాళ సినీ ఆరంభ, వికాసాలేమిటి? మన పాత్ర ఏమిటి?

ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం- రెంటాల జయదేవ ‘ఫస్ట్ రీల్.

రెంటాల జయదేవ గురించి:-

  • పుట్టింది… పండిత రచయితల రెంటాల వంశంలో. పెరిగింది… తెలుగు సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో!
  • చదివింది… సంస్కృతం నుంచి సైన్సు దాకా!
  • హైదరాబాద్, బెంగుళూరు, మద్రాసుల్లో ముచ్చటగా మూడు పీజీలు.
  • ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొని మరీ… ప్రాణం పెట్టింది… పత్రికా రచనలో.
  • ఎదిగింది, వెలిగింది… ‘ఈనాడు’, ‘ఇండియా టుడే’, ‘ప్రజాశక్తి’, ‘ఆంధ్రజ్యోతి’, ‘సాక్షి’లో.

  • పరిశోధించి పీహెచ్ డి సాధించింది… తెలుగు సాహిత్యంలో.
  • పంచ ప్రాణాలున్నవి… సాహిత్యం, సినిమా, సంస్కృతి, సమాజం, స్నేహంలో.
  • పేరు వచ్చింది… ప్రత్యేక – పరిశోధక వ్యాసాలు, సినీ సమీక్షలు, ప్రముఖుల పత్రికా – టీవీ ఇంటర్వ్యూలలో.
  • పిలిచి ఇచ్చింది… ఉత్తమ సినీ విమర్శకుడిగా ప్రభుత్వ నంది అవార్డుల్లో. ఉత్తమ జర్నలిస్టుగా అనేకానేక ప్రైవేటు సంస్థల పురస్కారాల్లో.
  • పుస్తకాలుగా వచ్చినవి… ‘మానస సరోవర యాత్ర’, మరిన్ని రామకృష్ణ మఠం ప్రచురణల్లో.
  • నమ్మినసూత్రం… చేసింది చిగురంత! చేయాల్సింది కొండంత!!
  • నిరవధిక పరిశ్రమ… నిరంతర పరిశోధన నిండిన నిత్య విద్యార్థి… డాక్టర్ రెంటాల జయదేవ.

పుస్తకం గురించి ప్రముఖుల అభిప్రాయాలు:-

“ఈ రచనలో ఎంతో పరిశోధన ఉంది. పరిశ్రమ ఉంది. చరిత్రను అందంగా, ఆసక్తిగా చదివించే వైనం ఉంది. ప్రభుత్వాలు, యూనివర్సిటీలు చేయాల్సిన పని ఒంటి చేతితో రెంటాల జయదేవ చేశారు. ఇది మన సినీచరిత్రకు ఆయన చేసిన మహోపకారం! ఈ అపూర్వ రచనను అన్ని భారతీయ భాషల్లోకీ ట్రాన్స్ లేట్ చెయ్యాలి”

– సింగీతం శ్రీనివాసరావు, దర్శకుడు

“దక్షిణాదిలో వివిధ భాషల సినీ పరిశ్రమల పుట్టుక, వాటిలో తెలుగువాళ్ళ పాత్ర తెలుసుకోవాలంటే ఈ రచన చదవాల్సిందే! డాక్టరేట్లు ఎలా వస్తాయో తెలీదు గానీ… డాక్టరేటుకు అర్హమైన గొప్ప పరిశోధనా గ్రంథం చదువుతున్నట్టు అనిపించింది”

– ఎస్.ఎస్. రాజమౌళి, దర్శకుడు

“భాషల ఎల్లలు చెరిపిన అఖిల భారత రచన ఇది. సినీ చరిత్రను ఇలా రాయడం ముఖ్యం. మన సెల్యులాయిడ్ డాక్యుమెంటేషన్స్ పై ఇది సరైన ఫోకస్ లైట్. ఎంతో కల్చరల్ ఇంపార్టెన్స్ ఉన్న లిటరరీ డాక్యుమెంటేషన్! ఒక విశిష్ట ప్రయత్నం, విజ్ఞాన భండారం!”

-ప్రకాశ్ రాజ్, నటుడు

“మన సినిమా ఫస్ట్ రీల్”
రచయిత- రెంటాల జయదేవ
ఫోన్- 94413 71357
పేజీలు- 566
వెల- రూ. 750
ప్రతులకు- ఎమెస్కో బుక్స్, హైదరాబాద్, విజయవాడ

(పుస్తకం అట్టమీద, లోపల ఉన్న వివారాలివి)

RELATED ARTICLES

Most Popular

న్యూస్