Saturday, January 18, 2025
HomeTrending Newsమానేర్ రివర్ ప్రంట్ వర్క్ కాలెండర్

మానేర్ రివర్ ప్రంట్ వర్క్ కాలెండర్

The Maneru Riverfront Is An Ideal For The Country :

దేశానికే ఆదర్శంగా, తెలంగాణ ప్రజలకు అత్యధ్బుత టూరిస్ట్ స్పాట్ గా కరీంనగర్ మానేరు తీరాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మానేరు రివర్ ప్రంట్ ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి, డీపీఆర్ ఫైనలైజేషన్, రిటైనింగ్ వాల్ తుది డిజైన్లు, భూసేకరణ తదితర అంశాలపై ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ టూరిజం, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్ జలసౌదలో సమీక్ష నిర్వహించారు. మొత్తం పదిహేను కిలోమీటర్ల పొడవుగా ప్రతిపాదించిన మానేరు రివర్ ప్రంట్లో తొలి విడతగా నాలుగు కిలోమీటర్ల మేర నిర్మాణాలు చేపట్టనున్నారు, గతంలో పలు దపాలుగా కన్సల్టెన్సీ, ఇరిగేషన్, టూరిజం శాఖల సంయుక్త ఆద్వర్యంలో రూపొందించిన అంశాలపై ఇవాల్టి సమావేశంలో సూచన ప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ముంపు తగ్గించే విదంగా రివర్ ప్రంట్ అందాలు మరింత ద్విగుణీక్రుతం అయ్యేలా హాప్ బారేజ్, హాప్ వీర్ ప్రాతిపదికన మెదటి విడత నిర్మాణాలకు రూపొందించిన నివేదికలకు మంత్రితో పాటు ఇరిగేషన్ ఉన్నతాధికారులు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.

గత వందేళ్ల నీటి విడుదల పరిమాణం ఆదారంగా 80 క్యూసెక్కులు మెదలు 3లక్షల 50వేల క్యూసెక్కుల వరకూ నీటి విడుదల సమయాల్లో రివర్ ప్రంట్ రిటైనింగ్ వాల్ నిర్మాణం దశల్లో ఎత్తు, విడ్త్, డెప్త్ పై చర్చించారు. ఈ అంశంపై సర్వే ఏజెన్సీ అందజేసిన డిజైన్లను పరిశీలించిన అనంతరం అతి త్వరలోనే ఈ ప్రతిపాదనలపై ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ ఆద్వర్యంలో వారం రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలతో పాటు మిగతా డిజైన్ పనులను పూర్తి చేయాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు, రోజు వారీగా పనుల్లో వేగం పెంచేందుకు ఎజెన్సీ ప్రతినిధులతో పాటు ఇరిగేషన్, టూరిజం అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ నెలాఖర్లోగా పూర్తి స్థాయి డీజైన్లు రూపొందించి టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు మొదలుపెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ నిధుల కొరత లేదన్నారు. ప్రాజెక్టులో అంతర్బాగంగా నిర్మించిన తీగల వంతెన నిర్మాణం ఇప్పటికే పూర్తైంది, రివర్ బెడ్ నిర్మాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో హాస్పిటాలిటీ ఏర్పాట్లు, చిల్డ్రన్ పార్క్స్, వాటర్ పౌంటేన్స్, బోటింగ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ఇతర ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజం శాఖ ఈడి శంకర్ రెడ్డి, టీఎస్ టీడీసీ సీఈ వెంకటరమణ, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, ఐఎన్ఐ కన్సల్టేన్సీ డైరెక్టర్ హర్ష్ గోయల్,ఇతర రాష్ట్ర, కరీంనగర్ జిల్లా ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Must Read : కరీంనగర్‌ జిల్లాకు వైఎస్‌ షర్మిల

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్