Monday, March 16, 2026
Homeస్పోర్ట్స్IPL: చెన్నై - లక్నో మ్యాచ్ రద్దు

IPL: చెన్నై – లక్నో మ్యాచ్ రద్దు

చెన్నై సూపర్ కింగ్స్ – లక్నో సూపర్ జెయింట్స్   మధ్య నేడు మొదలైన మ్యాచ్ వర్షం కారణంగా  రద్దయింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పెయీ ఏక్నా  క్రికెట్ స్టేడియంలో ఈ మొదలైన ఈ మ్యాచ్ లో   చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో జట్టులో ఆయుష్ బదోని ఒక్కడే రాణించి 33 బంతుల్లో రెండు ఫోర్లు నాలుగు  సిక్సర్లతో  59 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.  మిగిలిన వారిలో నికోలస పూరన్- 20;  కేల్ మేయర్స్- 14 ; మహాన్ వోహ్రా -10 పరుగులు చేశారు.  19.2 ఓవర్లలో ఏడు వికెట్ల కోల్పోయి 125 పరుగుల వద్ద వర్షం  మ్యాచ్ కు అంతరాయం  కలిగించింది.  ఆ తర్వాత మ్యాచ్ కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో రద్దు  చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular