Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్FIH Odisha Hockey: ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా; స్పెయిన్ గెలుపు

FIH Odisha Hockey: ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా; స్పెయిన్ గెలుపు

పురుషుల వరల్డ్ కప్ హాకీలో పూల్ ‘డి’  లో ఇండియా- ఇంగ్లాండ్ మధ్య హోరాహోరీగా జరిగిన నేటి  మ్యాచ్ డ్రా గా ముగిసింది.  దీనితో ఇరు జట్లకూ చెరో పాయింట్ దక్కింది. ఈ రెండు జట్లూ తాము ఆడిన తొలి మ్యాచ్ లో విజయం సాధించాయి. ఈ డ్రా తో రెండు జట్లూ చెరో నాలుగు పాయింట్లతో నిలిచాయి. రూర్కెలా లోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.

అంతకుముందు ఇదే స్టేడియంలో స్పెయిన్- వేల్స్ జట్ల జరిగిన మొదటి మ్యాచ్ లో 5-1 తేడాతో స్పెయిన్ విజయం సాధించింది.

17,23, 33, 39, 57  నిమిషాల్లో స్పెయిన్ గోల్స్ చేసింది, నాలుగు ఫీల్డ్ గోల్స్, ఒక పెనాల్టీ కార్నర్ ఉన్నాయి. వేల్స్ జట్టు 53 వ నిమిషంలో ఒక ఫీల్డ్ గోల్ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్