Sunday, September 8, 2024
HomeTrending Newsరాజస్థాన్ మంత్రుల రాజీనామా

రాజస్థాన్ మంత్రుల రాజీనామా

The New Ministers Of Rajasthan :

రాజస్థాన్ మంత్రివర్గ పునర్ వ్యవస్తీకరణకు అనుగుణంగా ఆ రాష్ట్ర మంత్రులందరూ  ఈ రోజు రాజీనామా చేశారు. ఆదివారం రాజస్థాన్ కాంగ్రెస్ సమావేశం నేపథ్యంలో మంత్రుల రాజీనామా వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్  నేతృత్వంలో రేపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మంత్రివర్గం నుంచి వైదొలగనున్నట్టు ముగ్గురు మంత్రులు ఇప్పటికే పార్టీ ఆధినాయకురాలు సోనియా గాంధీకి తెలిపారని కాంగ్రెస్ రాజస్థాన్ వ్యవహారాల ఇంచార్జ్ అజయ్ మాకెన్ శుక్రవారం వెల్లడించారు. సోనియా గాంధీకి లేఖ రాసిన వారిలో  విద్య శాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతసర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ, రెవిన్యూ శాఖ మంత్రి హరీష్ చౌదరి ఉన్నారు.

రాజస్తాన్ నూతన మంత్రివర్గం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అపశ్రుతులు తలెత్తకుండా మంత్రివర్గ విస్తరణలో సమతూకం పాటించే అవకాశాలు ఉన్నాయి. అసమ్మతి నేత సచిన్ పైలట్ వర్గానికి సముచిత స్థానం దక్కతుందో లేదో రేపటి వరకు వేచి చూడాలి.

Also Read : రాజస్థాన్లో మజ్లిస్ పార్టీ శాఖ

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్