Sunday, January 19, 2025
HomeTrending Newsపంజాబ్ లో రాబోయేది ఆప్ ప్రభుత్వమే

పంజాబ్ లో రాబోయేది ఆప్ ప్రభుత్వమే

Next Government In Punjab Is Aap Government Arvind Kejriwal :

పంజాబ్ లో బలహీన ప్రభుత్వం ఉండటంతో సంఘ వ్యతిరేక శక్తులు చెలరేగుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. పంజాబ్  ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని ప్రభుత్వం నడపలేకపోతున్నారని విమర్శించారు. అమృతసర్ లో ఈ రోజు అమ్ ఆద్మీ పార్టీ అధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో కేజ్రివాల్ పాల్గొన్నారు.  ప్రశాంతంగా ఉన్న పంజాబ్ లో కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస ఘటనలు ప్రజలను కలవరపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పంజాబ్ లో ప్రశాంత పరిస్థితులు నెలకొనేందుకు బలమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకులు కావాలని, అలాంటి ప్రభుత్వం అమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యం అవుతుందని కేజ్రివాల్  భరోసా ఇచ్చారు. పంజాబ్ లో రాబోయేది ఆప్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. ఎన్నికల తరుణంలో జరుగుతున్న వరుస ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పాలన, ప్రజల సంక్షేమం వదిలేసి  ఢిల్లీలో ఆ పార్టీ అధిష్టానంతో జరిగే సమావేశాల్లో పాల్గొనటమే సిఎం, మంత్రులకు, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమైన కార్యక్రమంగా మారిందని ధ్వజమెత్తారు.

మరోవైపు ఢిల్లీలో ఈ రోజు జరుగుతున్న పంజాబ్ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మెన్ అజయ్ మాకెన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో పంజాబ్ పిసిసి అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్దు, ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్ని తదితరులు పాల్గొన్నారు.

Also Read :పంజాబ్ కాంగ్రెస్ కొత్త నిబంధన

RELATED ARTICLES

Most Popular

న్యూస్