Call 1098 If Working With Children  :

బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడడమె కాకుండా బాల్యవివాహల నిర్మూలనకు కృషి చేస్తున్నామని బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బాలల హక్కుల ప్రజావేదిక జిల్లా సమావేశం శుక్రవారం జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు బండారి కల్యాణి అధ్యక్షతన జరుగగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ బాలల హక్కుల ప్రజా వేదిక జిల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలు నిర్మూలన కోసం ఎంతగానో కమిటీ కృషి చేస్తుoదని తెలిపారు. ఎవరైనా బాలలతో పని చేయిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1098 సమాచారం అందించాలన్నారు.

చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ధృస్ట్యా వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు దోమతెరలు, దుప్పట్లు రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండు చేశారు. విద్యార్థులకు విద్యా సామర్థ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సుభాష్ చంద్ర బోస్ కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జగిత్యాల జిల్లా బాలల హక్కుల ప్రజా వేదిక జిల్లా అధ్యక్షులు బండారి కళ్యాణి, జిల్లా కమిటీ సభ్యులు కరికాల ప్రవీణ్ కుమార్, దుర్గ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Also Read :  బలవుతున్న బాల్యం

బలవుతున్న బాల్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *