2021 ఏడాదికి నోబెల్ శాంతి బహుమతి ఇద్దరు జర్నలిస్టులను వరించింది. ఫిలిప్పీన్స్ కు చెందిన మరియా రెస్సా, రష్యా కు చెందిన దిమిత్రి మురతోవ్ కు దక్కింది. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటన చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూ శాంతి స్థాపనకు కృషి చేస్తున్నారని కమిటీ ప్రకటించింది. నోబెల్ బహుమతులు అందుకున్న మరియా రెస్సా, దిమిత్రి మురతోవ్ ప్రపంచ జర్నలిస్టులకు ప్రతినిధులని, ప్రతికూల పరిణామాల మధ్య పత్రికా స్వేఛ్చ కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు అయ్యారని నోబెల్ కమిటీ ప్రశంసించింది.

58 ఏళ్ల మరియా రెస్సా “ రాప్లర్” పేరుతో ఫిలిప్పీన్స్ లో డిజిటల్ మీడియా నిర్వహిస్తున్నారు. రాప్లర్ సంస్థ సహా వ్యవస్తాపకురాలైన మరియా రెస్సా కు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. పరిశోధనాత్మక జర్నలిజంలో  మరియా రెస్సా పేరు పొందారు. నోబెల్ బహుమతిపై స్పందిస్తూ తమ సంస్థ బృందంపై మరింత బాధ్యత పెంచిందని మరియా రేస్సా ఆనందం వ్యక్తం చేశారు. వాస్తవాలు లేకుండా ఏదీ సాధ్యం కాదని ఇందుకు నోబెల్ బహుమతే నిదర్శనమని మరియా రేస్సా అన్నారు.

రష్యాలో నోవయ గజెట స్వతంత్ర వార్తా పత్రిక సహా వ్యవస్థాపకుల్లో దిమిత్రి మురతోవ్ ఒకరు. నోబెల్ బహుమతి రావటం నా ఒక్కడి ఘనత కాదన్నదిమిత్రి మురతోవ్ నోబెల్ సాధించిన ఘనత నోవయ గజెట పత్రికకు దక్కుతుందన్నారు. మురాటోవ్ తన సగం బహుమతిని తన వార్తాపత్రికలోని ఆరుగురు జర్నలిస్టులు మరియు 2000 నుండి చంపబడిన విలేఖరులకు అంకితం చేశారు, వీరిలో ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్ట్ అన్నా పొలిట్కోవ్స్కాయ కూడా ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *