The Purvanchal Highway Is Dedicated To The Nation By Prime Minister Narendra Modi :
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు పూర్వాంచల్ జాతీయ రహదారిని ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్ మార్గం. మొత్తం 341 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రికార్డు సమయంలో నిర్మించి పూర్తి చేసింది. ఆరు వరసలు కలిగిన ఈ రహదారిని భవిష్యత్తులో ఎనిమిది వరుసలుగా విస్తరించేందుకు అనువుగా రూపొందించారు.
పూర్వాంచల్ రహదారి లక్నో జిల్లా నుంచి ప్రారంభమై అదే రాష్ట్రంలో 9 జిల్లాలు అంటే (పశ్చిమ నుండి తూర్పు వరకు) లక్నో, బారాబంకి, అమేథి, సుల్తాన్‌పూర్, అయోధ్య, అంబేద్కర్ నగర్, అజంగఢ్, మౌ జిల్లాల గుండా సాగి ఘాజీపూర్ జిల్లాలో ఉన్న మొహమ్మదాబాద్ – బక్సర్ హైవే వద్ద (NH-31) ముగుస్తుంది.
మొత్తం 22.500 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018లో శంకుస్థాపన చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే తో ఉత్తరప్రదేశ్, బిహార్ లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు వేగవంతమైన రవాణాతో పాటు వ్యవసాయం, వాణిజ్యం, పర్యాటకం మరియు ఇతర పారిశ్రామిక అభివృద్ధికి భారీ ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నది.
కాగా ఈ ఎక్స్‌ప్రెస్ మార్గం పై సుల్తాన్ పూర్ జిల్లాలో మూడున్నర కీమీ ఎయిర్ స్ట్రిప్ ను కూడా నిర్మించారు. అత్యవసర సమయాల్లో యుద్ద విమానాలు ఈ మార్గం పై దిగేలా నిర్మాణాన్ని చెపట్టారు. ప్రారంభోత్సవానికి హేర్క్యుల్స్ C-130 ఎయిర్ ఫోర్సు విమానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుల్తాన్ పూర్ జిల్లా ఖర్వాల్ ఖేరి ప్రాంతంలో ఈ రహదారి పైనే దిగారు. ప్రారంభోత్సవ అనంతరం భారత వాయు సేన ఈ మార్గం పై యుద్ధ విమానాలను దింపి ఎయిర్‌షో నిర్వహించింది.