పశ్చిమ బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గడ్డి పూల విప్లవం కొనసాగుతోంది. పెద్దసంఖ్యలో గ్రామ పంచాయతీ సీట్లను పాలక టీఎంసీ కైవసం చేసుకుంటోంది. మరోవైపు కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ 30,331 స్ధానాలను కైవసం చేసుకుని మరో 1767 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ కంటే దాదాపు నాలుగు రెట్లు అధికంగా స్ధానాలు దక్కించుకుని సత్తా చాటింది.
మరోవైపు ఫార్వార్డ్ బ్లాక్ 23 స్ధానాలను గెలుచుకుని మరో 11 స్ధానాల్లో ముందంజలో ఉంది. పంచాయతీ పోరులో ఓటర్లు తమకు పట్టం కట్టారని టీఎంసీ సంబరాల్లో మునిగితేలుతోంది. మమతా బెనర్జీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడి గూండాలతో అక్రమాలుక తెరలేపడంతోనే ఈ ఫలితాలు వచ్చాయని బీజేపీ ఆరోపించింది.