Saturday, January 18, 2025
HomeTrending Newsరష్యా - యూరోప్ యుద్ధంగా మారే ప్రమాదం

రష్యా – యూరోప్ యుద్ధంగా మారే ప్రమాదం

రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత జటిలం అవుతోంది. రెండు దేశాల మధ్య సంధి కుదర్చాల్సిన పాశ్చాత్య దేశాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా రష్యాతో సమర్థంగా పోరాడటంలో ఉక్రెయిన్‌కు తోడ్పాటు అందించే ఉద్దేశంతో ఆర్థిక సాయం చేసేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. రూ.1.5 లక్షల కోట్లు ఆర్థిక సాయం చేయాలని జీ7 దేశాలైన ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, యూకే, అమెరికా, ఐరోపా సమాఖ్యలు నిర్ణయించాయి. జర్మనీలోని కొనిగ్స్‌వింటర్‌లో జరిగిన సమావేశంలో రూ.73 వేల కోట్ల విరాళాలు సేకరించామని జర్మనీ ఆర్థిక మంత్రి క్రిస్టియన్‌ లిడ్నర్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, ఆహార సరఫరా దెబ్బతిన్నదని, ఎనర్జీ సరఫరా వ్యవస్థ కూడా ఆగమైందని జీ7 దేశాలు ఆవేదన వ్యక్తం చేశాయని తెలిపారు.

ఫిన్లాండ్‌కు రష్యా సహజవాయువు కట్‌..
తమ దేశానికి రష్యా సహజవాయువు సరఫరాను ఆపేసిందని ఫిన్లాండ్‌ తెలిపింది. సహజవాయువు సరఫరా చేసినందుకు రష్యా కరెన్సీ అయిన రూబుల్‌ రూపంలో చెల్లించాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రతిపాదించగా, ఫిన్లాండ్‌ అందుకు ఒప్పుకోలేదు. దీంతో రష్యా సహజవాయువు సరఫరా నిలిపేసింది. గత నెలలో పోలండ్‌, బల్గేరియా దేశాలకు కూడా రష్యా నుంచి సహజవాయువు సరఫరా నిలిచిపోయింది. కాగా, రష్యాకు వ్యతిరేకంగా ఏర్పడిన నాటోలో సభ్యత్వం పొందేందుకు ఇటీవలే ఫిన్లాండ్‌ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

అమెరికామ నాటో కూటమి దేశాలు…  రష్యాను చక్రబంధంలో ఇరికించాలనే కుటిల నీతితో ఫిన్లాండ్, స్వీడన్ దేశాలను కూడా నాటో కూటమిలో చేర్చుకునే పనిలో ఉన్నాయి. ఇదే జరిగితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాస్తా… రష్యా- యూరోప్ యుద్ధంగా పరిణమించే ప్రమాదం పొంచి ఉంది. అంతర్జాతీయా లావాదేవీల్లో డాలర్ తో తన పట్టు నిలుపుకునేందుకు అమెరికా… రక్షణ, ఆర్థిక సాయం పేరుతో ఉక్రెయిన్ భవిష్యత్తును దెబ్బతీసింది. ఇప్పుడు స్కాండినేవియన్ దేశాల్లో అశాంతి నెలకొల్పే పనిలో అమెరికా పావులు కదుపుతోంది.

Also Read : అమెరికా కుయుక్తులు..రష్యా గాండ్రింపులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్